Flood Surge
-
#Telangana
Nagarjuna sagar : నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 22 గేట్లు త్తి నీటి విడుదల
ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌కు 1.98 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ఔట్‌ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కుల మేరకు ఉంది. పెరుగుతున్న నీటిమట్టాన్ని నియంత్రించేందుకు 22 గేట్లను ఎత్తి, సుమారు 1.71 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
Published Date - 11:53 AM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
Vijayawada : ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
. మొత్తం ఇన్‌ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందని వెల్లడించారు.
Published Date - 11:07 AM, Thu - 31 July 25