DSE Notification
-
#Speed News
CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : ఈరోజు 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Date : 09-10-2024 - 10:46 IST