Drought Affected Mandals
-
#Andhra Pradesh
AP Drought Mandals: ఏపీలో తక్కువ వర్షపాతం నమోదైన కరువు మండలాల జాబితా విడుదల!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావితంగా గుర్తించినట్లు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షపాతం పడినా, కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:52 AM, Wed - 30 October 24