HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Zimbabwe Creates History By Winning 1st Match On Australian Soil

Zimbabwe Record: ఆసీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. జింబాబ్వే జట్టు చివరి వన్డేలో కంగారూలపై సంచలన విజయం సాధించింది.

  • By Balu J Published Date - 01:19 PM, Sat - 3 September 22
Zimbabwe Record: ఆసీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. జింబాబ్వే జట్టు చివరి వన్డేలో కంగారూలపై సంచలన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆసీస్‌పై గెలిచింది. తొలి రెండు వన్డేల్లో ఘోరపరాజయం పాలైన జింబాబ్వే మూడో వన్డేలో మాత్రం అదరగొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన జింబాబ్వే సిరీస్‌ను కోల్పోయినప్పటకీ… చివరి మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లు కంగారెత్తించారు. 31 ఓవరప్లలో 141 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులతో రాణించకుంటే ఇంతకన్నా తక్కువ స్కోర్‌కే కంగారూ టీమ్ ఆలౌటయ్యేది.

మిగిలిన బ్యాటర్లలో మాక్స్‌వెల్ 19 పరుగులు చేయగా… 9 మంది సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. జింబాబ్వే ర్యాన్ బర్ల్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. 141 పరుగుల ఛేజింగ్‌లో జింబాబ్వేకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే తొలి పవర్ ప్లే తర్వాత ఆ జట్టు కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ చకబావ 37 రన్స్‌తో జట్టును గెలిపించాడు. దీంతో 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ గడ్డపై జింబాబ్వేకు ఇదే తొలి విజయం. ఈ విజయం తమ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని జింబాబ్వే కెప్టెన్ చకబావా వ్యాఖ్యానించాడు. అటు ఆసీస్ కెప్టెన్ ఫించ్ కూడా జింబాబ్వే ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.

Tags  

  • australia
  • cricket
  • new record
  • Zimbabwe

Related News

Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్ పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్‌లో శుభారంభం చేసింది.

  • India U19: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్

    India U19: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్

  • Dhoni and Pandya: షోలే 2 కమింగ్ సూన్ : హార్దిక్ పాండ్య

    Dhoni and Pandya: షోలే 2 కమింగ్ సూన్ : హార్దిక్ పాండ్య

  • Women’s Premier League: మహిళల క్రికెట్ లో నవశకం

    Women’s Premier League: మహిళల క్రికెట్ లో నవశకం

  • Rohit Sharma: సెంచరీ కొట్టిన రోహిత్.. వన్డే ఓపెనర్ గా రికార్డ్!

    Rohit Sharma: సెంచరీ కొట్టిన రోహిత్.. వన్డే ఓపెనర్ గా రికార్డ్!

Latest News

  • NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

  • China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

  • Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

  • Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

  • HR Job: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: