World Cup 2023: వన్డే ప్రపంచ కప్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు
ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచ కప్ కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్..
- By Praveen Aluthuru Published Date - 01:07 PM, Tue - 25 July 23

World Cup 2023: ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచ కప్ కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ తో తలపడనుంది.ఈ సారి వరల్డ్ కప్ కు ఇండియా ఆతిధ్యమిస్తుంది. మొత్తం 10 స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. 46 రోజుల పాటు మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. 2011లో ధోనీ సారధ్యంలో టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ అందుకుంది.
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ వసీం జాఫర్ తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్, బ్యాటర్‌గా మిడిల్ ఆర్డర్‌లో చోటు కల్పించాడు. కెఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా రిజర్వు వికెట్ కీపింగ్ మరియు బ్యాటర్‌గా చోటు కల్పించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హర్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు ఇచ్చిన వసీం జాఫర్, యజ్వేంద్ర చాహాల్‌ని తీసుకోలేదు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు స్థానం దక్కింది. అయితే జట్టులో ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Also Read: Auto Ride: బెంగళూరులో బాదుడే బాదుడు.. 500 మీటర్లకే రూ.100 వసూలు చేసిన ఆటో డ్రైవర్