Kohli Winning Six: సిక్స్ తో చెలరేగిన కోహ్లీ.. విన్నింగ్ షాట్ వీడియో వైరల్!
విరాట్ కోహ్లీ (Virat Kohli) సిక్స్ షాట్‌తో ఆర్‌బీసీ (RCB)ని గెలిపించాడు. ఇప్పుడు ఆ షాట్ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది.
- Author : Balu J
Date : 03-04-2023 - 4:57 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. బౌలర్లు ఆకాశం వైపు చూడాల్సిందే. ఫీల్డర్లు పరుగులు పెట్టాల్సిందే. నిన్న ఐపీఎల్ (IPL 2023) మ్యాచ్ లో భాగంగా బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడింది. అయితే కోహ్లీ మునుపటి ఫామ్ ను అందుపుచ్చుకొని ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. చివరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు. అయితే విరాట్ కోహ్లీ (Virat Kohli) సిక్స్ షాట్‌తో ఆర్‌సీబీ (RCB)ని గెలిపించాడు. ఇప్పుడు ఆ షాట్ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది.
సరిగ్గా పన్నెండేళ్ల కిందట సిక్సర్‌తో వరల్డ్ కప్ ఫైనల్‌లో భారతను గెలిపించిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) షాట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు విరాట్ షాట్ తో ఆ సీన్స్ ను గుర్తుకు తెచ్చుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఇక కోహ్లీ కొట్టిన విన్నింగ్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు (Vrial) కొడుతోంది.
"𝑻𝒉𝒂𝒕 𝒊𝒔 𝒂 𝒔𝒉𝒐𝒕 𝒐𝒇 𝒂𝒏 𝑬𝑴𝑷𝑬𝑹𝑶𝑹" 🤌#KingKohli takes #RCB over the line with a sublime 6️⃣👊#TATAIPL #IPLonJioCinema | @RCBTweets @imVkohli pic.twitter.com/DUpY55ZfLM
— JioCinema (@JioCinema) April 2, 2023