Kohli Dance: భార్య పాటకి కింగ్ క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సమం చేశాడు.
- By Praveen Aluthuru Published Date - 07:48 AM, Mon - 6 November 23

Kohli Dance: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరించాడు.
ఇటీవల కింగ్ కోహ్లీ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కోహ్లీ మ్యాచ్ మధ్యలో ఫీల్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. విశేషమేమిటంటే విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ సినిమాలోని పాటకి డ్యాన్స్ చేసి చేశాడు. అనుష్క నటించిన ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంలోని ‘ఐన్‌వే-ఐన్‌వే లూట్ గయా’ పాటకి కింగ్ డ్యాన్స్ చేశాడు, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది .
ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ఈ ప్రపంచకప్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది . దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 243 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా 20 ఏళ్ల తర్వాత చరిత్రను పునరావృతం చేసింది. 2003లో ప్రపంచకప్‌లో వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచిన భారత్ , 2023లో మరోసారి ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ 101 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ 326 పరుగులు చేసింది.
#ViratKohli dancing on #AnushkaSharma's movie song. pic.twitter.com/gcNytSX1Lq
— Manoj (@Manoj7363847647) November 5, 2023
Also Read: Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు..నలుగురు మృతి