Kohli Earnings: నాకేమి అన్ని కోట్లు ఇవ్వట్లేదు సామీ
ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ కోసం ఒక పేజీ ఎప్పటికి ఉంటుంది. వయసుతో సంబంధమే లేకుండా కోహ్లీ సృష్టించిన రికార్డులు అలాంటివి.
- By Praveen Aluthuru Published Date - 08:20 PM, Sat - 12 August 23

Kohli Earnings: ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ కోసం ఒక పేజీ ఎప్పటికి ఉంటుంది. వయసుతో సంబంధమే లేకుండా కోహ్లీ సృష్టించిన రికార్డులు అలాంటివి. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ మైదానంలో ఉన్నాడంటే విజయం తధ్యమని చెప్పుకోవచ్చు. అందుకే అంటారేమో కోహ్లీ ఒక ఛేజ్ మాస్టర్ అని. రన్ మెషిన్ అని. మైదానంలో అడుగుపెట్టడమే ఆలస్యం బౌలర్లపై విరుచుకుపడకుండా నెమ్మదిగా మొదలుపెడతాడు. 20 బంతులు ఎదుర్కొని క్రీజులో నిలిస్తే మాత్రం ఆ రోజు బౌలర్లకు పీడకలగా మిగిలిపోతుంది. ఒకప్పుడు సచిన్ క్రికెట్ ఆరాధ్య దేవుడిగా ఎలాగైతే రాణించాడో ఇప్పుడు సచిన్ సాహిలో కోహ్లీ ప్రదర్శన ఇస్తున్నాడు.
విరాట్ కోహ్లీ కేవలం మైదానాలోనే కాదు సోషల్ మీడియాలోనూ కింగ్ గా రాణిస్తున్నాడు.కోహ్లీని ఇన్స్టాగ్రామ్ లో 256మిలియన్లకు పైగా ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాలో ప్రపంచంలోని క్రీడాకారులందరిలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. మొదటి, రెండు స్థానాల్లో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కోహ్లీ సోషల్ మీడియా సంపాదనపై తెగ ప్రచారం జరుగుతుంది. ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ ప్రాపగాండపై తాజాగా విరాట్ స్పందించాడు. తన సంపాదనపై వస్తోన్న వార్తలను విరాట్ కోహ్లి ఖండించాడు. నా సోషల్ మీడియా సంపాదన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేశాడు.
Also Read: Tirumala Attack: చిరుత దాడిలో లక్షిత మృతి: CBN-లోకేష్ దిగ్బ్రాంతి