Virat Kohli: వరల్డ్ కప్ కు ముందు కోహ్లీకి బ్రేక్!
Virat Kohli: మరో రెండు వారాల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు ద్వైపాక్షిక సీరీస్ లతో బిజీగా ఉన్నాయి. టీమిండియా కూడా సఫారీ టీమ్ తో సీరీస్ ఆడుతోంది.
- By Naresh Kumar Published Date - 09:32 PM, Mon - 3 October 22
Virat Kohli: మరో రెండు వారాల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు ద్వైపాక్షిక సీరీస్ లతో బిజీగా ఉన్నాయి. టీమిండియా కూడా సఫారీ టీమ్ తో సీరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు వరుసగా గెలిచి సీరీస్ కైవసం చేసుకుంది. కాగా మంగళవారం చివరి మ్యాచ్ జరగనుండగా…ఇది ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరనుంది. అయితే ఆస్ట్రేలియా వెళ్ళే ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకోనున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉండడు.
ముంబై వెళ్లి రెండు రోజులు ఫ్యామిలీ తో గడపనున్న కోహ్లీ తర్వాత జట్టుతో కలుస్తాడు. ఈ మేరకు బీసీసీఐ అతనికి అనుమతి ఇచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి. మూడేళ్లుగా ఫామ్ లో లేకుండా సతమతమైన విరాట్ ఆసియా కప్ కు ముందు బ్రేక్ తీసుకున్న కోహ్లీ ఆ టోర్నీలో అదరగొట్టాడు. 10 మ్యాచ్ లలో 57 సగటుతో 404 రన్స్ చేశాడు. ఇప్పుడు సఫారీ తో సీరీస్ లోనూ ఫామ్ కొనసాగించాడు. అయితే మెగా టోర్నీకి ముందు బ్రేక్ తీసుకొని కోహ్లీ మళ్లీ అదరగొడతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.