Viral Catch: క్రికెట్ లో అరుదైన డిస్మిస్ క్యాచ్
ఇంగ్లాండ్ లో సోమర్‌సెట్ మరియు యార్క్‌షైర్ జట్లు టి 20 ఫైనల్లో తలపడ్డాయి.మ్యాచ్ లో బౌలర్ పట్టిన క్యాచ్ వైరల్ గా మారింది.
- By Praveen Aluthuru Published Date - 06:43 PM, Thu - 18 July 24

Viral Catch: క్రికెట్ మైదానంలో ఎప్పుడు ఎం జరుగుతుందో అంచనా వేయలేం. ఒక్కోసారి చిన్న చిన్న ఇన్సిడెంట్లే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి.ముఖ్యంగా ఫీల్డింగ్ లోనే అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. పాకిస్థాన్ క్రికెట్లో ఇవి ఎక్కువగా చూస్తుంటాం. చెత్త ఫీల్డింగ్‌కు పేరు గాంచిన ఆ జట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. క్రికెట్ లవర్స్ కాస్త నవ్వుకోవాలి అంటే పాకిస్థాన్ ఫన్నీ ఫీల్డింగ్ అని యూట్యూబ్ లో కొడితే వందల వీడియోలు ప్రత్యక్షమవుతాయి.
Unluckiest dismissal for a batter. 😄 pic.twitter.com/KosmygSPVX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2024
అయితే ఒక్కోసారి అనుకోని క్యాచ్ లు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ మ్యాచ్ లో బౌలర్ పట్టిన క్యాచ్ వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ లో సోమర్‌సెట్ మరియు యార్క్‌షైర్ జట్లు టి 20 ఫైనల్లో తలపడ్డాయి. ఈ సమయంలో బెన్ క్లిఫ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మిడ్ వికెట్‌పై బౌలర్ వేసిన బంతిని స్ట్రయిట్ బౌండరీ వైపు కొట్టేందుకు బ్యాటర్ ప్రయత్నించాడు. అయితే అది కాస్తా వెళ్లి నాన్ స్ట్రయికర్‌కు తగిలింది. బాల్ తన వైపే వస్తోందని గ్రహించిన నాన్ స్ట్రయికర్ దాని నుంచి తప్పించుకునేందుకు కిందకు వంగాడు. కానీ వేగంగా దూసుకొచ్చిన బంతి అతడి భుజానికి బలంగా తాకి బౌన్స్ అయింది. అయితే బంతి కాస్తా వచ్చి బౌలర్ చేతుల్లో పడింది. దీంతో బ్యాటర్ సహా నాన్ స్ట్రయికర్ బ్యాట్స్ మెన్ కూడా షాకయ్యాడు. ఏం జరిగిందో తెలియక బిత్తరపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Game Changer : హమ్మయ్య ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ పోస్టుప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి..