HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >This Is Crunch Time For Rahul Dravid Saba Karim

Team India: ద్రావిడ్ కు ఇది కఠినమైన సమయం

ఆసియాకప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్ కూడా చేరలేకపోయింది.

  • Author : Naresh Kumar Date : 10-09-2022 - 5:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Dravid
Rahul Dravid

ఆసియాకప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఎన్నో భారీ అంచనాలు ఉన్నప్పటకీ పేలవమైన బౌలింగ్, కీలక సమయంలో బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. దీంతో ఈ జట్టుతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఎలా ఆడుతుందో అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ సాబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గా రాహుల్ ద్రావిడ్ హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నాడు.

రానున్న నాలుగు,ఐదు నెలలు ద్రావిడ్ కు ఎంతో కఠినమైన సమయంగా విశ్లేషించాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిస్తేనే కోచ్ గా ద్రావిడ్ కు సంతృప్తి లభిస్తుందన్నాడు. 2021లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రవిడ్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయన్నాడు. టీమ్ ను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా నడిపించేందుకు ద్రావిడ్ కష్టపడుతున్నా ఫలితాలు మాత్రం రావడం లేదన్నాడు. ద్రావిడ్ కోచింగ్ లోనే టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో విజయం సాధించాల్సి ఉన్నప్పటకీ అలా జరగలేదన్నాడు. ఇప్పుడు ఆసియాకప్ లో వైఫల్యం కూడా నిరాశకు గురి చేస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే రానున్న కాలం ది వాల్ కు సవాల్ గా అభివర్ణించాడు. త్వరలో టీ20 ప్రపంచకప్‌ రాబోతోందనీ, వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ కూడా ఉందనీ… ఈ రెండింటిపై దృష్టి పెట్టాలన్నాడు.

ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ ఛాంపియన్ గా నిలిచి, విదేశాల్లో టెస్ట్ సిరీస్ లు గెలిస్తేనే కోచ్ గా ద్రావిడ్ సక్సెస్ సాధించినట్టన్నాడు. ఈ విషయం గురించి అతనికి తెలుసని, ఏదేమైనా టీ ట్వంటీ వరల్డ్ కప్ తో రాహుల్ ద్రావిడ్ కు సవాల్ ఎదురుకాబోతోందని సాబా కరీం అభిప్రాయపడ్డాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian team coach
  • rahul dravid
  • saba karim on rahul dravid
  • team india

Related News

Brother... it's no joke! Vaibhav Suryavanshi has shattered records right from the start.

Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

ఇటీవల భారత క్రికెట్‌లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్‌లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్‌లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థల

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd