Team India WTC Final: న్యూజిలాండ్ విక్టరీ.. WTC ఫైనల్‌కు భారత్ అర్హత!
ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవకుండానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది.
- By Balu J Published Date - 01:14 PM, Mon - 13 March 23

అద్భుతం జరిగింది.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగకుండానే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించి ఆశ్చర్యపర్చింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ చివరి బంతికి శ్రీలంకను ఓడించిన తర్వాత ఇది కంఫర్మ్ అయిపోయింది. జూన్ 7 నుండి ఓవల్‌లో జరిగే WTC ఫైనల్‌లో ఇండియా (Team India) ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. కేన్ విలియమ్సన్ 121 పరుగులతో చేసిన వీరోచిత సెంచరీ కివీస్ ను గెలిచేలా చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టెస్టులో కివీస్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది.
285 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను అసిత ఫెర్నాండో వణికించాడు. దాంతో ఒక దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన కివీస్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీరోచిత పోరాటంతో కివీస్ ను గెలిపించాడు. ఇక రెండో టెస్టులో శ్రీలంక నెగ్గినా.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. దాంతో భారత్ (Team India) ఫైనల్ కు చేరుతుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుంది. తాజాగా భారత్ కూడా అర్హత సాధించింది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఈ ఏడాది జూన్ లో జరగనుంది. ఓవల్ వేదికగా జరిగే ఈ పోరు జూన్ 7 నుంచి ఆరంభం కానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్ కు చేరడం ఇది వరుసగా రెండోసారి. 2021లో జరిగిన ఫైనల్లో భారత్ (Team India) కివీస్ చేతిలో ఓడింది.
Also Read: Mohammed Siraj: ఆస్ట్రేలియన్స్ ‘బ్లాక్ మంకీ’ అని దూషించారు: మహ్మద్ సిరాజ్