Mohammed Siraj: ఆస్ట్రేలియన్స్ నన్ను ‘బ్లాక్ మంకీ’ అని దూషించారు: మహ్మద్ సిరాజ్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిరాజ్ తాను జాత్యహంకార (Abuse) అవమానాలను ఎదుర్కొన్నాని చెప్పాడు.
- By Balu J Published Date - 01:00 PM, Mon - 13 March 23
మహ్మద్ సిరాజ్.. (Mohammed Siraj) అసాధారణమైన బౌలింగ్ లో టీమిండియాకు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ కీలక వికెట్లు పడగొడుతూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. సిరాజ్ క్రికెట్ లోకి ప్రవేశించే ముందు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడో, ఆరంగేట్రం తర్వాత అంతకుమించి అవమానాలను ఎదుర్కొన్నాడు. సిరాజ్ తన మొదటి టెస్ట్ పర్యటన కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు తండ్రి మహ్మద్ గౌస్ మరణించిన విషయం తెలిసిందే. బాధను దిగమింగుకొని ఆటపై ద్రుష్టి పెట్టాడు (Mohammed Siraj).
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిరాజ్ తాను జాత్యహంకార (Abuse) అవమానాలను ఎదుర్కొన్నాని చెప్పాడు. “గతంలో ఆస్ట్రేలియాలో టూర్ లో ఉన్న తనను బ్లాక్ మంకీ పిలిచారని, ఆయన అవన్నీ పట్టించుకోలేదనీ, కేవలం ఆటపై మనసును నిమగ్నం చేశానని సిరాజ్ చెప్పాడు. అయితే అంపైర్ల వద్దకు వెళ్లి జాత్యహంకారంపై ఫిర్యాదు చేయాలని అనుకున్నలోపే అజ్జూ భాయ్ (అజింక్యా రహానే)కి ముందే రియాక్ట్ అయ్యాడు. ’’ఇక మా నాన్న మరణించిన మరుసటి రోజు నేను శిక్షణకు వెళ్లాను. రవిశాస్త్రి ఎంతో అండగా నిలిచాడు. బ్రిస్బేన్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పుడు రవిశాస్త్రి మాటలు గుర్తుకు వచ్చాయి‘‘ సిరాజ్ (Mohammed Siraj) అన్నాడు.
Also Read: CM KCR: ‘నాటు నాటు’ తెలంగాణ సంస్కృతికి, జీవన వైవిధ్యానికి అద్దం పట్టింది!