Switch Hit:ఆ షాట్ ను బ్యాన్ చేయాలి
క్రికెట్ లోకి షార్ట్ ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు పలువురు స్టార్ ప్లేయర్స్ కొత్త కొత్త షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.
- By Naresh Kumar Published Date - 03:52 PM, Sat - 16 July 22
క్రికెట్ లోకి షార్ట్ ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు పలువురు స్టార్ ప్లేయర్స్ కొత్త కొత్త షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది స్విచ్ షాట్…స్పిన్నర్ల బౌలింగ్‌లో తమ ఫుట్ వర్క్ మార్చుకుని బాల్ హిట్ చేయడానికి వీలయ్యే స్థితిలోకి వెంటనే మారిపోయి బౌండరీలు బాదడమే స్విచ్ షాట్. మ్యాక్స్ వెల్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్ తదితరులు స్విచ్ హిట్ ఆడడంలో సిద్ధహస్తులు..ఈ షాట్లతో ఫీల్డింగ్ సెట్టింగ్‌ను బురిడీ కొట్టిస్తుంటారు. కొన్ని సార్లు బ్యాటర్లు పదేపదే హిజీగా స్విచ్ హిట్ ఆడుతుంటే.. స్పిన్నర్ల లెంత్ అండ్ స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. బ్యాటర్‌కే అనుకూలంగా మారుతుంది. దీంతో ఈ షాట్ పై పలువురు మాజీ ఆటగాళ్ళు స్పందిస్తున్నారు.
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ స్విచ్ షాట్‌పై నిషేధం విధించాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. లెగ్ స్టంప్ వెలుపల బంతి పిచ్ అయితే బ్యాటర్‌ని లైన్లో ప్యాడ్లపై తాకినా లెగ్-బిఫోర్ వికెట్‌కు ఔట్ ఇవ్వడం లేదనే విషయాన్ని స్టైరిస్ ప్రస్తావించాడు. ఇటీవల అశ్విన్ చెప్పిన పాయింట్‌తో ఏకీభవించిన స్టైరిస్ అశ్విన్ సూచించిన పరిష్కారాలతో మాత్రం విభేదించాడు. ఎల్బీడబ్ల్యూ చట్టంలో తప్పేమీ లేదని స్టైరిస్ చెప్పాడు.స్విచ్ హిట్‌తో మనం కొంత ఆనందించినప్పటికీ.. స్విచ్ హిట్‌ని పూర్తిగా నిషేధించాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ఎందుకంటే ఫీల్డ్ ప్లేస్ మెంట్ టైంలో కెప్టెన్లు బౌలర్లకు అనుగుణంగా వారి ఫీల్డర్లను సెట్ చేసుకుంటారనీ,అవి కూడా పవర్ ప్లే నియమాలను అనుసరించి ఉంటాయన్నాడు. ఇలాంటి టైంలో స్విచ్ హిట్ ఆడుతూ.. బౌలర్లను మోసం చేసినట్లేనని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అందుకే స్విచ్ హిట్ షాట్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని అతడు సూచించాడు.
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల స్విచ్ హిట్ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్విచ్ హిట్ ఆడుతున్నప్పుడు బ్యాటర్.. బంతిని మిస్సయి ఎల్బీడబ్ల్యూ అయితే తప్పకుండా ఇన్ లైన్ విషయాన్ని కన్సిడర్ చేయకుండా వికెట్లను గిరటేస్తే అవుటివ్వాలని పేర్కొన్నాడు.
Related News
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]