Srikanth -Shravya : పెళ్లి షాపింగ్ చేసిన కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ.. పెళ్లి పనులు షురూ..
త్వరలోనే శ్రీకాంత్ - శ్రావ్య పెళ్లి జరగనుంది.
- By News Desk Published Date - 08:26 PM, Sun - 22 September 24

Srikanth -Shravya : బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మని నిశ్చితార్థం చేసుకొని, ఓ ఫోటో షేర్ చేసి త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్.. స్టైలిస్ట్, ఆర్జేవేయి మేనకోడలు శ్రావ్య వర్మని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు.
త్వరలోనే శ్రీకాంత్ – శ్రావ్య పెళ్లి జరగనుంది. తాజాగా వీరి పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ లోని గౌరీ సిగ్నేచర్స్ ని సందర్శించారు. శ్రీకాంత్ కిదాంబి, శ్రావ్యవర్మ తమ పెళ్ళికి, హల్ది, మెహందీ, సంగీత్, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు తమ ఫ్యామిలిలో అందరికి ఇక్కడే సిగ్నేచర్ స్టూడియో లో వెడ్డింగ్ డిజైన్స్ లో సెలెక్ట్ చేసుకొని మరీ షాపింగ్ చేసుకున్నారు.
ఈ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సాయి మాట్లాడుతూ.. శ్రీకాంత్ కిదాంబి , శ్రావ్య వర్మలు మా స్టోర్స్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సెలబ్రిటీస్ కి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటు బడ్జెట్ లలో మా దగ్గర డిజైనర్ దుస్తులు దొరుకుతాయి అని తెలిపారు.