HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Sri Lanka Deeply Regret Batting Collapse Against Australia

World Cup 2023: చిరాకు పడుతున్న ఫ్యాన్స్.. 84 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది

  • By Praveen Aluthuru Published Date - 05:09 PM, Tue - 17 October 23
  • daily-hunt
World Cup 2023 (35)
World Cup 2023 (35)

World Cup 2023: మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. సీనియర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ నిరాశపరిచినా మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీష్ కలిసి ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించారు..ఇన్నింగ్స్ లో బౌలర్లు సైతం చెలరేగిపోయారు. భారీ స్కోరు చేసేలా కనిపించిన లంకను అరికట్టడంలో ఆసీస్ బౌలర్లు విజయం సాధించారు. దీంతో శ్రీలంక స్వల్ప స్కోరుకి చాప చుట్టేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిజానికి శ్రీలంక ఆరంభం నుంచి ధాటిగా ఆడటంతో 300 స్కోర్ ఈజీగా సాదిస్తుందనుకున్నారు. వికెట్ కోల్పోకుండా 100కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు నిస్సంకా, కుసల్‌ పెరెరా హాఫ్‌ సెంచరీలతో గట్టి పునాది వేశారు. దీంతో ఆసీస్ కు మరో ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు.. లంక బ్యాటింగ్‌ లైనప్‌ను కుదేలు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్‌కు పంపుతూ.. 209 పరుగులకు వారిని ఆలౌట్‌ చేశారు. సరిగ్గా 125 రన్స్‌ వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన లంక.. మరో 84 పరుగులు మాత్రమే చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది.

ఇన్నింగ్స్ లో నిస్సంకా 61, పెరెరా 78 తప్ప మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 4 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. మిచెల్‌ స్టార్క్‌ 2, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ 2, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిచెల్‌ మార్ష్‌ 51 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేయగా, జోష్‌ ఇంగ్లిస్‌ 59 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 58 పరుగులు చేశాడు. మార్నస్‌ లబూషేన్‌ 60 బంతుల్లో 2 బౌండరీలు కొట్టి 40 పరుగులు రాబట్టాడు.ఆఖర్లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 21 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారా హ్యాట్రిక్ అపజయాలతో శ్రీలంక అట్టడుగున చేరింది.125 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోని శ్రీలంక 209 పరుగులకు ఆలౌట్‌ అవ్వడం క్రికెట్‌ అభిమానులకు షాక్‌కు గురిచేసింది.

Also Read: Sky Fruit : గుండెపోటు రిస్క్ ను తగ్గించే ‘స్కై ఫ్రూట్’.. తెలుసా ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 84 runs
  • 9 wickets
  • AUS Vs SL
  • australia
  • Sri Lanka
  • world cup 2023

Related News

Minister Lokesh receives rare invitation from Australian government

Nara Lokesh : మంత్రి లోకేశ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ఆహ్వానం

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి లోకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program) లో పాల్గొనాల

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd