Shane Warne 2nd Death Anniversary: షేన్ వార్న్ రెండవ వర్ధంతి సందర్భంగా కుమార్తె భావోద్వేగ పోస్ట్
ఆస్ట్రేలియా గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రెండవ వర్ధంతి సందర్భంగా, అతని కుమార్తె బ్రూక్ వార్న్ భావోద్వేగ పోస్ట్ చేసింది. బ్రూక్ తన తండ్రితో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నది. షేన్ వార్న్ 4 మార్చి 2022న థాయ్‌లాండ్‌లో మరణించాడు.
- By Praveen Aluthuru Published Date - 11:07 PM, Mon - 4 March 24

Shane Warne 2nd Death Anniversary: ఆస్ట్రేలియా గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రెండవ వర్ధంతి సందర్భంగా, అతని కుమార్తె బ్రూక్ వార్న్ భావోద్వేగ పోస్ట్ చేసింది. బ్రూక్ తన తండ్రితో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నది. షేన్ వార్న్ 4 మార్చి 2022న థాయ్‌లాండ్‌లో మరణించాడు.
గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కూతురు తన తండ్రి రెండవ వర్ధంతి సందర్భంగా చాలా ఎమోషనల్ అయింది. షేన్ వార్న్ మార్చి 4, 2022న థాయ్‌లాండ్‌లో మరణించాడు. అదే రోజు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ రోడ్నీ మార్ష్ కూడా తుది శ్వాస విడిచాడు. వార్న్ మరణం తర్వాత గత రెండేళ్లుగా మానసికంగా ఎంత కష్టపడిందో బ్రూక్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలిపింది. తన తండ్రితో కలిసి బ్రిటీష్ పీరియడ్ క్రైమ్ డ్రామా టీవీ సిరీస్ పీకీ బ్లైండర్స్‌ను చూసే సమయాన్ని గుర్తుచేసుకుంది.
నేటికి రెండేళ్లు అయింది నాన్న. మీరు లేకుండా జీవితం చాలా నెమ్మదిగా మరియు వేగంగా గడిచిపోయింది. పీకీ బ్లైండర్‌ల కొత్త సీజన్ ఎలా ఉందో మీరు మాతో సరదాగా మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మేము కలిసి తదుపరి ఎపిసోడ్ చూస్తాము. నువ్వు లేకుండా జీవితానికి అర్ధమే లేదు. మేము ప్రతిరోజూ మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి ప్రయత్నిస్తాము. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను అంటూ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన ప్రేమను మరియు బాధను వ్యక్త పరిచింది.
షేన్ వార్న్ 52 ఏళ్ల వయసులో మరణించాడు. థాయ్‌లాండ్ అతనికి గుండెపోటు వచ్చింది. సమూజనా విల్లా రిసార్ట్‌లోని లగ్జరీ విల్లాలో వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, వార్న్‌ని రక్షించలేకపోయారు. వార్న్ మరణాన్ని వార్న్ మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Gopichand : గోపీచంద్ భీమా.. ఛాన్స్ వాడుకుంటాడా..?