Jason Holder : భారత్ కు హోల్డర్ వార్నింగ్
భారత్ తో సిరీస్ కు ముందు వెస్టిండీస్ జట్టు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది.
- By Hashtag U Published Date - 11:06 AM, Mon - 31 January 22

భారత్ తో సిరీస్ కు ముందు వెస్టిండీస్ జట్టు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది. అయితే సిరీస్ డిసైడర్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ అదరగొట్టాడు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న హోల్డర్ ఈ మ్యాచ్ లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను బౌల్ చేసిన హోల్డర్ రెండో బంతి నుండి వరుసగా నలుగురు ఇంగ్లాండ్ క్రికెటర్లను పెవిలియన్ కు పంపించాడు. హోల్డర్ వరుసగా జోర్డాన్ , బిల్లింగ్స్ , ఆదిల్ రషీద్ , షకీబ్ మసూద్ లను ఔట్ చేశాడు. దీంతో డబుల్ హ్యాట్రిక్ సాధించడమే కాదు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికి తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. అలాగే టీ ట్వంటీ ఫార్మేట్ లో విండీస్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఒక విధంగా హోల్డర్ ఫామ్ టీమిండియాకు డేంజర్ బెల్స్ గానే చెప్పాలి. ఈ సిరీస్ లో హోల్డర్ 15 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. విండీస్ సిరీస్ విజయంలో హోల్డర్ దే కీలకంగా మారింది. బంతితో పాటు బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించే ఈ విండీస్ ఆల్ రౌండర్ ఐపీఎల్ ఆడడం ద్వారా ఇక్కడి పిచ్ లపై బాగానే అవగాహన కలిగి ఉన్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున గత సీజన్ లో నిలకడగా రాణించిన బౌలర్ హోల్డర్ మాత్రమే. దీంతో టీమిండియాతో జరిగే సిరీస్ లో విండీస్ కు హోల్డర్ కీలకం కానున్నాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే హోల్డర్ బౌలింగ్ ను జాగ్రత్తగా ఆడకుంటే మన బ్యాటర్లు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇక ఇంగ్లాండ్ , విండీస్ చివరి టీ ట్వంటీ విషయానికొస్తే…మొదట బ్యాటింగ్ కు దిగిన కరేబియన్ టీమ్ 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ పొల్లార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కూడా ధాటిగానే ఆడింది. జేమ్స్ విన్స్ హాఫ్ సెంచరీకి తోడు బిల్లింగ్స్ కూడా చెలరేగడంతో గెలిచేలా కనిపించింది. అయితే చివర్లో హోల్డర్ మ్యాచ్ ను మలుపు తిప్పడంతో ఇంగ్లాండ్ 117 రన్స్ తేడాతో ఓడిపోయింది.