Sania Mirza: సానియా మీర్జా రోలెక్స్ వాచ్ విలువ
టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన జీవనశైలిని చాలా లగ్జరీగా ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె రిటైర్మెంట్ ప్రకటించి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 07:41 PM, Thu - 14 September 23

Sania Mirza: టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన జీవనశైలిని చాలా లగ్జరీగా ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె రిటైర్మెంట్ ప్రకటించి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. సానియా మీర్జా రూ.200 కోట్లకు పైగా నికర విలువతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నది. ఆమె వద్ద లగ్జరీ కార్లు, ఇతర ఆభరణాల తో సహా ఒక లగ్జరీ వాచ్ ను కలిగి ఉంది. తాజాగా ఆమె ముంబై విమానాశ్రయంలో తళుక్కుమంది. రెడ్ డ్రెస్ లో ఆమె ఎంతో అందంగా కనిపించినప్పటికీ అందరి దృష్టి మాత్రం ఆమె చేతికున్న వాచ్ పైనే పడింది. తన చేతికున్న రోలెక్స్ వాచ్ విలువ అక్షరాలా రూ. 12 లక్షలు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో అందర్నీ రోలెక్స్ వాచ్ ఆకర్షిస్తుంది.
సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయినట్టు ఈ మధ్య పుకార్ల చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై ఇప్పటివరకు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. 2010లో సానియా షోయబ్ ల వివాహం జరిగింది. 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.