Ganta Srinivasa Rao : టీడీపీ జనసేన పొత్తుపై గంటా శ్రీనివాసరావు కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో మరిచిపోలేని రోజు..
తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ జనసేన పొత్తుపై మీడియాతో మాట్లాడారు.
- Author : News Desk
Date : 14-09-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు రాజమండ్రి జైల్లో బాలకృష్ణ(Balakrishna), లోకేష్(Lokesh) లతో కలిసి పవన్ కల్యాణ్(Pavan Kalyan) చంద్రబాబు(Chandrababu) ను కలిసి అనంతరం బయటకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జనసేన(Janasena) రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP)తో కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావం చెప్పేందుకే వచ్చాను అని తెలిపారు పవన్. పవన్ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సహం వచ్చింది.
టీడీపీ జనసేన పొత్తుపై అధికార నాయకులు విమర్శలు చేస్తుంటే, టీడీపీ జనసేన నాయకులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ జనసేన పొత్తుపై మీడియాతో మాట్లాడారు.
గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao)మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో ఈ రోజు మరిచిపోలేని రోజు. చంద్రబాబు భేటీ తరువాత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంత కాలం ఉన్న అనుమానాలు, సందేహలు పటాపంచలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ ప్రకటన వైసీపీకీ చమరగీతం పలకాడానికి నాంది. బీజేపీ కూడా కలిసి వస్తారని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు సైతం బీజేపీ గమనిస్తుంది. వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేకంగా ఉంది. అమిత్ షా, జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఈ సారి వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది. మాకు 160 సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. జనసేన కలయికతో టీడీపీకి మరింత బలం పెరుగుతుంది. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయి అని అన్నారు.