HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit On Playing Ix Vs Pakistan

T20 WC: అట్లుంటది మనతోని… తుది జట్టుపై రోహిత్ శర్మ

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ఆదివారం నుంచే షురూ కానుంది. మొదట క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుండగా.. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం మొదలవుతుంది.

  • Author : Naresh Kumar Date : 15-10-2022 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohiht
Rohiht

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ఆదివారం నుంచే షురూ కానుంది. మొదట క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుండగా.. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం మొదలవుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న అన్ని జట్లూ వార్మప్ మ్యాచ్ లు, ప్రాక్టీస్ సెషన్స్ తో బిజీగా గడుపుతున్నాయి. అయితే అక్టోబర్ 23న జరిగే భారత్ , పాక్ మ్యాచ్ పైనే అందరి దృష్టీ ఉంది. ఫైనల్ కాని ఫైనల్ గా భావించే చిరకాల ప్రత్యర్థుల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ పై కేవలం భారత్ , పాక్ ఫ్యాన్సే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ తో మ్యాచ్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టుపై తనకో క్లారిటీ ఉందని చెప్పాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. రోహిత్ మాత్రం క్లారిటీ ఇచ్చేశాడు.

తుది జట్టు ఇప్పటికే ఖరారైందన్నాడు. పాకిస్థాన్ లాంటి చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఉండే ఒత్తిడితో పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగుతానని హిట్ మ్యాన్ చెప్పాడు. చివరి నిమిషంలో నువ్వు ఇవాళ ఆడుతున్నావ్ అని జట్టులో ఆటగాడికి చెప్పే అలవాటు తనకు లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి లాస్ట్ మినిట్ రిస్క్ తీసుకోలేనని చెప్పేశాడు. రోహిత్ వ్యాఖ్యలు చూస్తే తుది జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బూమ్రా రీ ప్లేస్ మెంట్ ఎంపికైన షమీ జట్టుతో కలిసినప్పటకీ… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్ తర్వాత అతని ప్లేస్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. షమీ సీనియర్ బౌలర్ అని, జట్టుకు మేలు చేకూర్చే నిర్ణయాలే తీసుకుంటామన్నాడు. ఆటలో గాయాలు సహజమేనన్న హిట్ మ్యాన్ గత ఏడాది కాలంగా రిజర్వ బెంచ్‌ను బలంగా చేసే పనిలో పడ్డామని చెప్పుకొచ్చాడు. .పాక్‌తో మ్యాచ్ కంటే ముందు షమీకి 3 నుంచి 4 బౌలింగ్ సెషన్లు ఉంటాయన్నాడు. భారత తుది జట్టు కాంబినేషన్ లో వికెట్ కీపర్ గా పంత్ కంటే కూడా సీనియర్ దినేశ్ కార్తీక్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Captain Rohit Sharma
  • ICC T20 World Cup 2022
  • India Playing XI
  • India vs Pakistan

Related News

Shoaib Akhtar takes a U-turn

యూటర్న్ తీసుకున్న షోయబ్ అక్తర్

Shoaib Akhtar  టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు. ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మా

  • Shoaib Akhtar Angry on Mohsin Naqvi

    భారత్‌పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

  • IND vs PAK

    రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • T20 World Cup 2026

    భారత్ – పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd