Rishabh Pant : ఆ హీరోయిన్‌కు పంత్ కౌంటర్.. పోస్ట్ డిలీట్..!!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య ఏం జరుగుతోంది... నిజంగానే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా...ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
- By hashtagu Published Date - 07:05 PM, Thu - 11 August 22

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య ఏం జరుగుతోంది… నిజంగానే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా…ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
బాలీవుడ్, క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు కొత్తేమీ కాదు. అప్పటి పటౌడీ-షర్మిలా ఠాకూర్ నుంచి నిన్నటి కోహ్లీ-అనుష్క వరకూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారే. ఇదే బాటలో ఇప్పటితరం ఆటగాళ్ళు కూడా పయనిస్తున్నారు. అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య స్టోరీ మరోలా ఉంది. నిన్నటి వరకూ వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందన్న వార్తలు తెగ షికారు చేశాయి. ఇన్‌స్టా గ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడం.. తర్వాత బ్లాక్ చేయడం ఇలా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు వీరిద్దరి మధ్య అసలేమీ లేదన్న అనుమానం తెరపైకి వచ్చింది. ఈ మధ్యే ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్పీ అనే వ్యక్తి తనను కలవడానికి వచ్చాడని, తాను అలసిపోయి పడుకోవడంతో గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది. ఆ ఆర్పీ ఎవరు అని అడిగితే.. ఆ వ్యక్తి మొత్తం పేరు తాను చెప్పనని ఊర్వశి అన్నది. చివరికి తాను లేచిన తర్వాత చూస్తే ఎన్నో మిస్డ్ కాల్స్ ఉన్నాయని కూడా ఊర్వశి చెప్పింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ పంత్‌ను ఉద్ధేశించేనని సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది.
ఆర్పీ అంటే రిషబ్ పంత్ అంటూ చాలా మంది డిసైడైపోయారు. ఈ వార్త పంత్‌కు కూడా చేరడంతో ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్ చేస్తూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంటర్య్వూల్లో కొంతమంది తమ పేరు, ప్రఖ్యాతల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంటారనీ, . ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోందన్నాడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తుంటారనీ దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలన్నాడు.
చివరిగా ప్లీజ్ అక్క.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్ ఉంటుందంటూ కాప్షన్ జత చేశాడు. మరి పంత్ చేసిన వ్యాఖ్యలపై ఊర్వశి రౌతేలా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే పంత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డిలీట్ చేశాడని చెబుతున్న ఓ స్క్రీన్‌షాట్ వైరల్‌గా మారింది. ఆ స్టోరీ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించేనని కూడా నెటిజన్లు ఫిక్సయ్యారు. ఈ స్టోరీ పెట్టి డిలీట్ చేయడానికి పంత్‌కు 10 నిమిషాలు పట్టింది. ఆలోపే స్క్రీన్‌షాట్లు తీసుకున్న నెటిజన్లు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు