Olympic Council Of Asia President: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా భారత మాజీ షూటర్.. ఇది రికార్డే..!
45 దేశాల అధికారుల సమావేశంలో రణధీర్ సింగ్‌ను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా నియమించారు. రణధీర్ పంజాబ్‌లోని పాటియాలాకు చెందినవారు. 77 ఏళ్ల వయసులో ఆయన చరిత్ర సృష్టించారు.
- By Gopichand Published Date - 02:52 PM, Sun - 8 September 24

Olympic Council Of Asia President: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడి కుర్చీ చాలా రోజులుగా ఖాళీగా ఉంది. అయితే సెప్టెంబర్ 8 ఆదివారం రోజు భారత మాజీ షూటర్ రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా (Olympic Council Of Asia President) ఎన్నికయ్యాడు. 44వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో OCA కొత్త అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎన్నికయ్యారు.
45 దేశాల సమక్షంలో చరిత్ర సృష్టించారు
45 దేశాల అధికారుల సమావేశంలో రణధీర్ సింగ్‌ను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా నియమించారు. రణధీర్ పంజాబ్‌లోని పాటియాలాకు చెందినవారు. 77 ఏళ్ల వయసులో ఆయన చరిత్ర సృష్టించారు. రణధీర్ మొదటి భారతీయ OCA అధ్యక్షుడయ్యాడు. ఇంతకు ముందు భారతీయులెవరూ OCA ప్రెసిడెంట్ కాలేదు. రణధీర్ స్వయంగా షూటింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాగా అతని మామ మహారాజా యద్వీంద్ర సింగ్ కూడా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు. రణధీర్ తండ్రి భలీంద్ర సింగ్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్.
రణధీర్ తండ్రి 1947-1992 మధ్య IOC సభ్యుడు. నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న రణధీర్ భారత్ తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 1978లో ట్రాప్ షూటింగ్‌లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత 1982లో కాంస్యం, 1986లో రజతం సాధించాడు. 1978లో కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రణధీర్ పాల్గొన్నాడు.
Veteran sports administrator Randhir Singh has been officially elected as the first Indian president of the #OCAInIndia2024 in 44th General Assembly of the Asian body.
A 5 time Olympic shooter, Randhir was the lone eligible candidate for the OCA president's post pic.twitter.com/cFweVoJGkO
— Stranger (@Stranger4every1) September 8, 2024
2012 వరకు ప్రధాన కార్యదర్శి
రణధీర్ తొలిసారిగా 1987లో క్రీడా పరిపాలనలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో అతను భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు. అతను 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. రణధీర్ 1987లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బోర్డు సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. రణధీర్ 2012 వరకు ఈ పదవిలో ఉన్నారు.