Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Pv Sindhu And Sai Praneeth Crash Out

Indonesia Open 2022: సింధు, సాయి ప్రణీత్ ఔట్

ఇండోనేసియా ఓపెన్ లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. సింధు తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది

  • By Naresh Kumar Published Date - 04:15 PM, Tue - 14 June 22
Indonesia Open 2022: సింధు, సాయి ప్రణీత్ ఔట్

ఇండోనేసియా ఓపెన్ లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. సింధు తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది. చైనా ప్లేయర్ బింగ్ జియావో 21-14,21-17 స్కోర్ తో సింధు పై విజయం సాధించింది. ప్రపంచ నం. 9 ర్యాంకు బింగ్ జియావోతో తలపడాల్సి రావడంతో సింధుకు గట్టి డ్రా లభించింది. ఊహించినట్టుగానే జియావో తొలి గేమ్ నుంచే ఆధిపత్యం కనబరిచింది. సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్ గెలుచుకుంది. అయితే రెండో గేమ్ లో సింధు పోరాడింది. ఫస్టాప్ తర్వాత ఆధిక్యం కనబరిచిన సింధు..సెకండాఫ్ లో మళ్లీ వెనుకబడింది. చివరికి 18-21 తో గేమ్ తో పాటు మ్యాచ్ కోల్పోయింది. గతవారం ముగిసిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లోనూ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. ఉమెన్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు.. కేవలం 33 నిమిషాల్లోనే గేమ్ కోల్పోయింది. ఇక 2 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి వైదొలగడంతో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కథ ముగిసింది. ఇదిలా ఉండగా తెలుగు తేజం సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించాడు.
ప్రపంచ 19వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 16-21, 19-21తో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ విట్టింగ్‌హస్‌తో 45 నిమిషాల్లో ఓడిపోయాడు.

Tags  

  • indonesia open
  • PV Sindhu
  • sai praneeth

Related News

PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!

PV Sindhu Meets Allu Arjun: స్టైలిష్ స్టార్ తో పీవీ సింధు.. ఫొటో వైరల్!

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారుతోంది.

  • PV Sindhu loses cool: బాధపడకు సింధు….నీ తప్పులేదని తెలుసు..!!

    PV Sindhu loses cool: బాధపడకు సింధు….నీ తప్పులేదని తెలుసు..!!

  • PV Sindhu: ‘ఆసియా ఛాంపియన్ షిప్’ లో సెమీస్ కు సింధూ!

    PV Sindhu: ‘ఆసియా ఛాంపియన్ షిప్’ లో సెమీస్ కు సింధూ!

  • Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

    Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Latest News

  • Thunder : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మెరుపు వీడియో… 500 అడుగుల దూరంలో..?

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: