IPL 2023: సెంచరీ వీరుడికి ప్రీతి హాట్ హగ్
ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 65 బంతుల్లో 103 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
- By Praveen Aluthuru Published Date - 11:17 AM, Sun - 14 May 23
IPL 2023: ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 65 బంతుల్లో 103 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ప్రభసిమ్రాన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది.
పంజాబ్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ విజయం కీలకం. మ్యాచ్ గెలిచిన తర్వాత పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేవు. ఈ సంతోషకరమైన సమయంలో ఆమె ప్రభాస్‌సిమ్రాన్ సింగ్‌కి గాఢమైన కౌగిలి ఇచ్చి సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆ సీన్ ఒకటిరెండు సార్లు రిపీట్ చేస్తున్నారు. నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. ట్విట్టర్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక మీమర్స్ కి ఇదొక స్టఫ్ లా తయారైంది.
ఈ మ్యాచ్‌లో ప్రభుసిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభించాడు. తొలి 30 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే దీని తర్వాత పంజాబ్ బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా ప్రభసిమ్రన్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 65 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 158 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న ప్రభాసిమ్రన్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అదరగొట్టాడు.
Read More: MAN SWALLOWS 7 GOLD BISCUITS : ఏడు గోల్డ్ బిస్కెట్లు మింగితే కక్కించారు