HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pakistan Virtually Out Of World Cup Semifinal Race

World Cup Semifinal: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఆ జట్టే.. నాలుగో బెర్తుపై క్లారిటీ..!

వన్డే ప్రపంచకప్ రసవత్తరంగానే సాగుతోంది. సెమీఫైనల్ (World Cup Semifinal)లో మూడు బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి.

  • Author : Naresh Kumar Date : 10-11-2023 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs New Zealand
Compressjpeg.online 1280x720 Image 11zon

World Cup Semifinal: వన్డే ప్రపంచకప్ రసవత్తరంగానే సాగుతోంది. సెమీఫైనల్ (World Cup Semifinal)లో మూడు బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా టాప్ ప్లేస్ తో సెమీస్ కు దూసుకెళ్ళగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలోనూ, ఆస్ట్రేలియా మూడో స్థానంలోనూ సెమీస్ కు క్వాలిఫై అయ్యాయి. ఆసీస్, సౌతాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరగనుండగా.. నాలుగో బెర్తు కోసం మూడు జట్లు రేసులో ఉండడంతో భారత్ ప్రత్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే శ్రీలంకపై న్యూజిలాండ్ విజయంతో నాలుగో సెమీస్ బెర్తుపై క్లారిటీ వచ్చింది. దాదాపుగా కివీస్ జట్టే సెమీస్ కు చేరుకోనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్నాయి.

ఆప్ఘనిస్తాన్ జట్టు అవకాశాలు దాదాపుగా ముగిసిపోగా.. పాక్ జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇంగ్లాండ్ తో చివరి మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఇంగ్లండ్‌తో శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి. అలా జరగాలంటే పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్‌ను 130 పరుగులకు ఆలౌట్ చేయాలి.

Also Read: New Zealand: సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్.. కీలక మ్యాచ్ లో శ్రీలంకపై విజయం

ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ విధంగా చూసుకున్నా ఇది అసాధ్యం. దీంతో నాలుగో సెమీస్ బెర్తు న్యూజిలాండ్ దేనని తేలిపోయింది. ఇక అధికారక ప్రకటన మాత్రమే మిగిలింది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీస్ లో భారత్, కివీస్ తలపడనుండగా..రెండో సెమీస్ నవంబర్ 16న సౌతాప్రికా,ఆసీస్ మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే 2019 ప్రపంచకప్ సెమీస్ లోనూ భారత్ ప్రత్యర్థి కివీసే. అప్పుడు ధోనీ రనౌట్ తో మ్యాచ్ ను తమవైపు తిప్పుకున్న న్యూజిలాండ్ పై ఈ సారి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket World Cup 2023
  • ICC world cup
  • ICC World Cup 2023
  • Ind vs NZ
  • world cup 2023
  • World Cup Semifinals

Related News

SHIVAM DUBE TOOK A 5AM TRAIN FROM AHMEDABAD TO MUMBAI

ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Shivam Dube  టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యా

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • Suryakumar Yadav

    టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

    T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

  • World Champions

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టైటిల్ మ‌న‌దే!!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd