Pakistan T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్..!!
టీ20 ప్రపంచకప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.
- Author : Hashtag U
Date : 15-09-2022 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
టీ20 ప్రపంచకప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం ప్రకటించింది. గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన పేసర్ షాహిన్ షా అఫ్రిది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫఖర్ జమాన్ అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. పీసీబీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
ఫకార్ జమాన్ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ మహ్మద్ మసూద్‌ని తీసుకున్నారు. ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఓడిపోగా, సూపర్-12లో భాగంగా అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీకి ముందు పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, నవాజ్, రిజ్వాన్ (వికెట్ కీపర్), వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్ ఉమ్రాన్ ఖాదిర్. స్టాండ్‌బై: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షహనాజ్ దహానీ.
Introducing our squad 🙌
🗒️ https://t.co/JnHpDOvXsS#T20WorldCup | #BackTheBoysInGreen pic.twitter.com/BbmTdtBfhk
— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2022