New Zealand World Cup Jersey : వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ కొత్త జెర్సీ.. 29న హైదరాబాద్ లో కివీస్ మ్యాచ్
New Zealand World Cup Jersey : వచ్చే నెల (అక్టోబరు) 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ టీమ్ కొత్త జెర్సీని విడుదల చేసింది.
- Author : Pasha
Date : 19-09-2023 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
New Zealand World Cup Jersey : వచ్చే నెల (అక్టోబరు) 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ టీమ్ కొత్త జెర్సీని విడుదల చేసింది. గతంలోలాగే నలుపు రంగులో ఉన్న ఈ జెర్సీలో పొట్ట భాగంలో న్యూజిలాండ్ అని రాసి ఉంది. ఛాతీ ఎడమవైపు కివీస్ చిహ్నమైన సిల్వర్ ఫెర్న్ ఆకు, కుడివైపున ఐసీసీ వన్డే ప్రపంచకప్ లోగో ఉన్నాయి. భుజాల వద్ద స్పాన్సర్ బ్రాండ్ ను డిస్ ప్లే చేశారు. ఈ టీ షర్ట్ కింది వైపు నిలువు చారల డిజైన్ ఉంది. పేసర్లు లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లేథమ్ కొత్త జెర్సీని ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ‘మన క్రికెట్ ప్రపంచ కప్ టీషర్ట్ అందుబాటులోకి వచ్చేసింది’ అంటూ క్రికెట్ న్యూజిలాండ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేసింది.కివీస్ వన్డే టీమ్ కు వరల్డ్ కప్ లో లాకీ ఫెర్గూసన్ సారథ్యం వహించనున్నారు.
Also read : Sampoornesh Babu : ‘మార్టిన్ లూథర్ కింగ్’ గా వస్తున్న సంపూర్ణేష్ బాబు
గాయాలతో టీమ్ కు దూరమైన మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్లీ వచ్చి చేరనుండటం అనేది న్యూజిలాండ్ టీమ్ కు ప్లస్ పాయింట్ కానుంది. వన్డే ప్రపంచకప్‌లో అతడి అనుభవం టీమ్ కు బాగా ఉపయోగపడనుంది. ఇండియాలోని పిచ్‌లు, ఇక్కడి వాతావరణంపై కేన్ విలియమ్సన్ కు మంచి అవగాహన ఉంది. నాలుగోసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్న టిమ్ సౌథీ న్యూజిలాండ్ టీమ్ లో కీలకమైన ప్లేయర్ గా ఉన్నాడు. మెరుపులు మెరిపించే సత్తా ఉన్న మార్క్ చాప్‌మన్ కూడా ఆ టీమ్ లో ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకూ ఆ టీమ్ లో చోటు దక్కింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ సన్నాహక మ్యాచ్ ఆడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అరగంట ముందే టాస్ (New Zealand World Cup Jersey) వేస్తారు. పెద్ద జట్లే కావడంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా.