NZ In SF: న్యూజిలాండ్ సెమీస్ చేరినట్టే
టీ ట్వంటీ వరల్డ్ కప్ గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
- Author : Naresh Kumar
Date : 04-11-2022 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
టీ ట్వంటీ వరల్డ్ కప్ గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న కివీస్ ఐర్లాండ్ పై 35 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఫిన్ అలెన్ 32, డెవాన్ కాన్వే 28 పరుగులు చేశారు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తరువాత ఫామ్ లోకి వచ్చాడు. సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసే ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లోనే మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.
అయితే డెత్ ఓవర్లల్లో కివీస్ వరుస వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ పేసర్ జోషువా లిటిల్.. భారీ స్కోర్ సాధించేలా దూసుకెళ్తోన్న న్యూజిలాండ్ ను కట్టడి చేశాడు. దీంతో కివీస్ ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 19 వ ఓవర్ లో జోషువ లిటీల్ హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా మూడు వికెట్లు తీసిన మొట్టమొదటి ఐర్లాండ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
Skipper Kane Williamson named Player of the Match at @TheAdelaideOval after his 61 from 35 balls against @cricketireland. #T20WorldCup pic.twitter.com/Xm7U8L7HKn
— BLACKCAPS (@BLACKCAPS) November 4, 2022