Messi Match : మెస్సీ కోసం హనీమూన్ ను వాయిదా వేసుకున్న లేడీ ఫ్యాన్
Messi Match : అభిమానుల కోలాహలంలోఒక నూతన వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రధారణలో, చేతికి పెళ్లి గాజులతో కనిపించిన ఆమె మెస్సీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు
- Author : Sudheer
Date : 13-12-2025 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా కోల్‌కతాకు చేరుకోవడంతో దేశంలో ఫుట్‌బాల్ సందడి తారాస్థాయికి చేరింది. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు, స్వాగతం పలికేందుకు పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది అభిమానులు సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తారు. మెస్సీ పేరుతో నినాదాలు చేస్తూ, జెర్సీలు ఊపుతూ అభిమానులు చేసిన సందడి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అపూర్వ దృశ్యాన్ని ఆవిష్కరించింది. మెస్సీని చూడగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పర్యటన భారత్‌లోని ఫుట్‌బాల్ ప్రియులకు ఓ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు.
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
అభిమానుల కోలాహలంలోఒక నూతన వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రధారణలో, చేతికి పెళ్లి గాజులతో కనిపించిన ఆమె మెస్సీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె చేతిలో ఉన్న ఒక ప్లకార్డు అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో “గత శుక్రవారం మా పెళ్లయింది, కానీ మెస్సీ వస్తుండటంతో ఆయనను చూసేందుకు హనీమూన్ వాయిదా వేసుకున్నాం” అని రాసి ఉంది. ఈ వినూత్న ప్రదర్శన మెస్సీకి భారత్‌లో ఉన్న అభిమాన బలం ఎంత గొప్పదో తెలియజేసింది. తన పెళ్లి తర్వాత అత్యంత ముఖ్యమైన హనీమూన్ ప్రణాళికను సైతం పక్కన పెట్టి, ఫుట్‌బాల్ లెజెండ్‌ను చూడటానికి ఆమె చూపిన అంకితభావం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Farmhouse Party : దువ్వాడ దంపతులు చెప్పేది నిజమేనా..? అసలు ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది..?
ఈ సందర్భంగా ఆ నూతన వధువు మెస్సీకి తాను ఎంత పెద్ద అభిమానినో వెల్లడించారు. కేవలం ఆటకు మాత్రమే కాకుండా, మెస్సీ మైదానంలో చూపించే నైతిక విలువలు, వినయానికి కూడా తాను అభిమానినని ఆమె తెలిపారు. ఫుట్‌బాల్ ఆటపై భారతదేశంలో ముఖ్యంగా కోల్‌కతాలో తరతరాలుగా ఉన్న మమకారాన్ని ఈ సంఘటన మరింత బలంగా చూపించింది. మెస్సీ రాక దేశీయ ఫుట్‌బాల్‌కు నూతనోత్తేజాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటన దేశంలో ఫుట్‌బాల్ క్రీడా స్ఫూర్తిని, దిగ్గజ ఆటగాళ్ల పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.