HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Kohli Scripts 2 Magnificent World Records With Sensational Fifty Against Pakistan

Virat Kohli: కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే

  • By Naresh Kumar Published Date - 12:14 AM, Mon - 5 September 22
Virat Kohli: కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే

పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ తన ఫామ్ అందుకున్నాడు. ఆసియాకప్ లో గాడిన పడిన విరాట్ తాజాగా పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్నా… ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.

చివరి వరకూ క్రీజులో ఉన్న కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండు రికార్డులు అందుకున్నాడు. ఈ హాఫ్‌ సెంచరీతో టీ ట్వంటీల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్‌కు టీ ట్వంటీల్లో ఇది 32వ హాఫ్‌ సెంచరీ. తద్వారా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను వెనక్కి నెట్టాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 31వ హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ ఇప్పుడు పాక్ పై ఇన్నింగ్స్ తో హిట్ మ్యాన్ ను అధగమించాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ కెవిన్‌ పీటర్సన్‌, న్యూజిలాండ్‌ బ్యాటర్లు గప్టిల్‌, కేన్‌ విలియమ్సన్‌, ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఆరోన్‌ ఫించ్‌ల సరసన నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో ఓవరాల్ గా కోహ్లికి ఇది 194వ ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు.ఈ 194 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లలో 70 సెంచరీలు ఉన్నాయి. ఈ ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లలో సచిన్‌ టాప్‌ లో ఉన్నాడు. కాగా ఈ ఆసియాకప్ లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ కు దూసుకెళ్ళాడు. పాక్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 35 రన్స్ చేసిన కోహ్లీ హాంకాంగ్‌తో మ్యాచ్‌లోనూ 44 బాల్స్‌లో 59 రన్స్‌ చేశాడు.

Tags  

  • asia cup 2022
  • India vs Pakistan
  • kohli record
  • Records
  • virat kohli

Related News

KL Rahul: కేఎల్ రాహుల్ కు కోహ్లీ, ధోనీ ఖరీదైన కానుకలు.. అసలు విషయం చెప్పిన కుటుంబ సభ్యులు..!

KL Rahul: కేఎల్ రాహుల్ కు కోహ్లీ, ధోనీ ఖరీదైన కానుకలు.. అసలు విషయం చెప్పిన కుటుంబ సభ్యులు..!

బాలీవుడ్ నటి అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (Athiya Shetty- KL Rahul) ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ జనవరి 23న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి చిత్రాలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

  • KL Rahul Weeding Gifts: కేఎల్ రాహుల్ పెళ్లికి ధోనీ, కోహ్లీ ఖరీదైన కానుకలు.. అవేంటో చూద్దాం..!

    KL Rahul Weeding Gifts: కేఎల్ రాహుల్ పెళ్లికి ధోనీ, కోహ్లీ ఖరీదైన కానుకలు.. అవేంటో చూద్దాం..!

  • Virat And Rohit: రోహిత్, కోహ్లీలను అందుకే టీ ట్వంటీలకు తప్పించాం: ద్రావిడ్

    Virat And Rohit: రోహిత్, కోహ్లీలను అందుకే టీ ట్వంటీలకు తప్పించాం: ద్రావిడ్

  • Virat Kohli Networth: అతడు రన్స్ మెషీన్ మాత్రమే కాదు.. మనీ మెషీన్ కూడా

    Virat Kohli Networth: అతడు రన్స్ మెషీన్ మాత్రమే కాదు.. మనీ మెషీన్ కూడా

  • IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్‌స్వీప్

    IND vs SL 3rd ODI: వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. లంకతో సిరీస్ క్లీన్‌స్వీప్

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: