KOHLI: ఫిట్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ కోహ్లీ
సమకాలిన క్రికెట్ లో అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న ఆటగాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కోహ్లీ మొదటి స్థానంలో నిలుస్తాడు
- By Naresh Kumar Published Date - 12:57 PM, Sat - 15 October 22

సమకాలిన క్రికెట్ లో అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న ఆటగాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కోహ్లీ మొదటి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే కోహ్లీ ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే అత్యున్నత ప్రమాణాలు పాటిస్తాడు. అందుకే కోహ్లీ ఫిట్ నెస్ సమస్యలు , గాయాలతో ఇబ్బందిపడిన సందర్భాలు చాలా తక్కువ. ఫిట్ నెస్ పరంగా కోహ్లీ ఎలా ఉంటాడనేది మరోసారి నిరూపితమైంది. 2021-22 సీజన్‌కు సంబంధించి కోహ్లీ ఒక్కసారి కూడా గాయపడలేదు.గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో , గాయాలతో ఈ సీజన్ కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న క్రికెటర్ల జాబితాపై ఎన్ సిఎ నివేదిక ఇచ్చింది. ఈ జాబితాలో రోహత్ , రాహుల్, పంత్ , శ్రేయాస్ అయ్యర్, ధావన్ , సూర్యకుమార్ . హార్థిక్ పాండ్యా వంటి ఆటగాళ్ళు ఉండగా…కోహ్లీకి మాత్రం ఒక్కసారి కూడా ఆ అవసరం రాలేదు. ఈ సీజన్ లో మొత్తం 70 మంది ఆటాగాళ్లకు ఎన్‌సీఏ వైద్య బృందం చికిత్స చేసింది. అయితే గత ఏడాది కాలంగా కోహ్లీ ఒక్కసారి కూడా గాయం లేదా ఫిట్ నెస్ సమస్యలతో ఎన్ సీఎకు రాలేదనీ బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతంలో 2018లో విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా కౌంటీల్లో ఆడలేకపోయాడు. ఆ ఇబ్బందిని అధిగమించిన తర్వాత విరాట్ ఒక్కసారి కూడా గాయం లేదా ఫిట్ నెస్ సమస్యలతో ఎన్ సిఎకు రాలేదు. దీంతో ఆట పరంగానే కాకుండా ఫిట్ నెస్ అంశంలోనూ కోహ్లీని యువక్రికెటర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.