HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports
  • ⁄Kohli 186 Fires India To Lead Australia 3 0 As Head Kunhemann Survive

India: విరాటపర్వంతో నాలుగోరోజు మనదే

అహ్మదాూాద్ టెస్టులో నాలుగోరోజు భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

  • By Naresh Kumar Updated On - 08:36 PM, Sun - 12 March 23
India: విరాటపర్వంతో నాలుగోరోజు మనదే

India: అహ్మదాూాద్ టెస్టులో నాలుగోరోజు భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. విరాట్ కోహ్లీ శతకానికి తోడు అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సమయోచిత ఇన్నింగ్స్ తో భారత్ కు ఆధిక్యం దక్కింది. నాలుగోరోజు ఆటలో కోహ్లీ సెంచరీనే హైలెట్ గా చెప్పాలి. సుదీర్ఘ కాలంగా టెస్టుల్లో శతకం కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు దానిని అందుకున్నాడు. రొటీన్ బ్యాటింగ్ కు భిన్నంగా చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ… జడేజా, శ్రీకర్ భరత్ , అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జడేజా 28 రన్స్ కే వెనుదిరిగినా.. తర్వాత భరత్ , కోహ్లీకి చక్కని సపోర్ట్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఐదో వికెట్ కు 84 పరుగులు జోడించారు. భరత్ హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. 241 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ ఇన్నింగ్స్ లో కేవలం 5 ఫోర్లే ఉన్నాయి. సెంచరీ తర్వాత కాస్త దూకుడు పెంచిన విరాట్ , అక్షర్ పటేల్ తో కలిసి స్కోర్ 500 దాటించాడు. గత కొంతకాలంగా లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తో సత్తా చాటుతున్న అక్షర్ పటేల్ మరోసారి ఆకట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి ఆరో వికెట్ కు 162 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా… చివరి సెషన్ లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేయగా…శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేదు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 571 పరుగులకు ముగిసింది. దీంతో టీమిండియాకు 92 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆసీస్ బౌలర్లలో లయోన్ 3 , మర్ఫీ 3 , స్టార్క్ , కునేమన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఆసీస్ ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. అయితే మ్యాచ్ కు రేపు చివరి రోజు కావడంతో ఫలితం వచ్చే అవకాశాలు లేనట్టే. దీంతో అహ్మదాబాద్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయమైందని చెప్పొచ్చు. తద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో దక్కించుకోనుంది. అయితే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచితీరాలి, ఇప్పుడు డ్రాగా ముగియడంతో శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాలి. కివీస్ ఆ మ్యాచ్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Telegram Channel

Tags  

  • 4th test
  • border and gavaskar trophy
  • India vs Australia
  • virat kohli
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

India vs Australia: స్టార్క్ దెబ్బకు భారత్ విలవిల

India vs Australia: స్టార్క్ దెబ్బకు భారత్ విలవిల

విశాఖ వన్డేలో భారత (India) బ్యాటింగ్ కుప్పకూలింది. ఊహించని విధంగా టాపార్డర్ లో కోహ్లీ తప్పిస్తే అంతా ఘోరంగా విఫలమయ్యారు. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే సగం జట్టు పెవిలియన్ కు చేరింది.

  • Nani @Cricket Match: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో సందడి చేసిన నాని.. వీడియో..!

    Nani @Cricket Match: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో సందడి చేసిన నాని.. వీడియో..!

  • India vs Australia: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. టీమిండియాలో రెండు మార్పులు..!

    India vs Australia: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. టీమిండియాలో రెండు మార్పులు..!

  • India vs Australia: నేటి మ్యాచ్‌లో నెగ్గేదెవరో.. విశాఖ వేదికగా రెండో వన్డే..!

    India vs Australia: నేటి మ్యాచ్‌లో నెగ్గేదెవరో.. విశాఖ వేదికగా రెండో వన్డే..!

  • Virat Kohli: విరాట్ కోహ్లీపై ఫిట్నెస్ కోచ్‌ బసు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

    Virat Kohli: విరాట్ కోహ్లీపై ఫిట్నెస్ కోచ్‌ బసు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Latest News

  • Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

  • Health Tips: అధిక రక్తపోటు సమస్యకు అరటిపండుతో చెక్ పెట్టండిలా?

  • Finland: అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్..!

  • Offerings To God: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?

  • Oklahoma: పక్కంటి యువతిని రూంకి పిలిచి… ఆమె ఆ పార్టుని కోసి.. వండుకొని తిని!

Trending

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

    • RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

    • Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: