World Cup 2023: ప్రపంచ కప్ లో రాహుల్ కి చోటు.. ఫ్యాన్స్ ఫైర్
వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ప్రపంచ కప్ ఆడనుంది.
- By Praveen Aluthuru Published Date - 04:28 PM, Tue - 5 September 23

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ ప్రపంచ కప్ ఆడనుంది. 15 సభ్యుల్లో కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది . గాయం కారణంగా గత మే నుంచి జట్టుకు దూరమయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ కు స్థానం కల్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో సంజు శాంసన్ కి కూడా చోటు దక్కకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొన్ని నెలలుగా రాహుల్ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు ప్రపంచ కప్ కి సెలెక్ట్ చేస్తే ఎలాంటి ప్రదర్శన ఇస్తాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి మరియు ఫామ్‌ను తిరిగి పొందడానికి రాహుల్‌కు సమయం కూడా లేదు.
ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే మరో 4 మ్యాచ్‌లు ఆడి ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో పాల్గొంటుంది. అంటే ప్రపంచకప్‌కు ముందు భారత్ మరో 7 వన్డేలు ఆడాల్సి ఉంది. ఆసియా కప్ లోనూ రాహుల్ కు స్థానం కల్పించారు. మరి ఈ మ్యాచ్ లలో రాహుల్ ఆడతాడా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇటీవల కోచ్ ద్రావిడ్ ప్రెస్ మీట్ లో కేఎల్ రాహుల్ ఆసియా కప్ లో రెండు మ్యాచ్ లకు మాత్రమే దూరంగా ఉంటాడని స్పష్టం చేశాడు.
ప్రపంచ కప్ జట్టులో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడానికి ఒక కారణం ఏమిటంటే, అతను మిడిల్ ఆర్డర్‌లో రాణించగలడు. రాహుల్ ఐదో నంబర్‌లో ఆడే అవకాశం ఉంది. వన్డేల్లో అతని రికార్డు చాలా బాగుంది. 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ 18 వన్డేల్లో 53 సగటుతో 742 పరుగులు చేశాడు. సెంచరీ కూడా చేశాడు. గత 2 సంవత్సరాలలో ఈ నంబర్‌తో ఆడుతూ అతను 8 మ్యాచ్‌లలో 48 సగటుతో 289 పరుగులు చేశాడు.
Also Read: Jagan London tour : జగన్ పర్యటన వెనుక బ్లాక్ ..!