HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kkr Land Shreyas Iyer For Inr 12 25 Crore

Shreyas: శ్రేయాస్ అయ్యర్‌కు జాక్‌పాట్‌

ఐపీఎల్ మెగా వేలంలో ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టాడు. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలంలో నిలిచిన అయ్యర్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.

  • Author : Balu J Date : 12-02-2022 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shreyas
Shreyas

ఐపీఎల్ మెగా వేలంలో ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టాడు. బేస్ ప్రైస్ 2 కోట్లతో వేలంలో నిలిచిన అయ్యర్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ స్టార్ క్రికెటర్‌ను తీసుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించడంతో బిడ్డింగ్‌లో ధర పెరుగుతూ పోయింది. చివరికి రూ12.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రేయాస్ అయ్యర్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా ఏడు ఐపీఎల్‌ సీజన్లలో అయ్యర్‌ 87 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 2375 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్‌ అయ్యర్.. 2020 ఐపీఎల్‌లో జట్టును ఫైనల్‌ చేర్చాడు.

అయితే ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక అయ్యర్‌ గాయంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ రిషబ్‌ పంత్‌కు నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ తిరిగి వచ్చినా ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం మాత్రం రిషబ్‌ పంత్‌నే సారథిగా కొనసాగించింది. దీంతో వేలంలోకి వెళ్ళాలని శ్రేయాస్ నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ కూడా రిటైన్ చేసుకోకపోవడంతో ఫ్రాంచైజీతో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. మొత్తం మీద వేలంలో అయ్యర్‌కు మంచి డిమాండ్ ఉంటుందన్న అంచనాలు నిజం చేస్తూ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయ్యర్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశముందని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • IPL 2022 Auction
  • offer
  • shreyas iyer

Related News

Shreyas Iyer Catch

Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !

క్రికెట్‌లో 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనే మాటను అయ్యర్ మరోసారి నిజం చేశాడు. ఆ క్యాచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బంతిని అందుకునే క్రమంలో శరీరాన్ని నియంత్రించుకుంటూ, సెకనులో వందో వంతు కాలంలో నిర్ణయం తీసుకోవడం అయ్యర్ పరిణతికి నిదర్శనం

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd