John Cena Retirement: WWE నుండి జాన్ సెనా రిటైర్మెంట్
మనీ ఇన్ బ్యాంక్ లైవ్ మ్యాచ్ సందర్భంగా జాన్ సెనా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రాత్రి నేను WWE నుండి నా రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను అని జాన్ సెనా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను WWE తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 07-07-2024 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
John Cena Retirement: WWE చరిత్రలో జాన్ సెనా రారాజుగా కొనసాగాడు. తన కెరీర్‌లో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాడు. అయితే 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జాన్ సెనా WWE నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది WWEకి వీడ్కోలు పలుకుతానని సెనా ఇదివరకే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో జాన్ సెనా 2025 సంవత్సరంలో చివరిసారిగా WWE రింగ్‌లో కనిపించనున్నాడు.
కెనడాలోని టొరంటోలో జరిగిన WWE మనీ ఇన్ బ్యాంక్ లైవ్ మ్యాచ్ సందర్భంగా జాన్ సెనా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రాత్రి నేను WWE నుండి నా రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను అని జాన్ సెనా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను WWE తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ప్రకటన తర్వాత ఆయన అభిమానులు తీవ్ర బాధకు గురయ్యారు. మై చైల్డ్ హుడ్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
జాన్ సెనా మాట్లాడుతూ.. చరిత్రలో మొదటి మరియు చివరిసారి చాలా విషయాలు జరుగుతాయి. 2025 రాయల్ రంబుల్ నా చివరిది. 2025 ఎలిమినేషన్ ఛాంబర్ నా చివరిది. లాస్ వెగాస్ రెసిల్ మేనియా 2025 నా చివరి రెసిల్ మేనియా అని ప్రకటించాడు. 47 ఏళ్ల జాన్ సెనా 2001లో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. దాంతర్వాత WWE నుండి కాంట్రాక్ట్ పొందాడు. 2018 సంవత్సరంలో జాన్ సెనా నటన ప్రపంచంలోకి కూడా ప్రవేశించాడు. అతను హాలీవుడ్ చిత్రాలలో కనిపించాడు.జాన్ సెనా 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
Also Read: Social Media War : పోర్ట్‌లపై సోషల్ మీడియాలో తుఫాను