Adelaide Test Match : ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, మిడిల్ ఆర్డర్లో రోహిత్
Adelaide Test Match : జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరన్న దానిపై తాజాగా రోహిత్ సమాధానమిచ్చాడు. అన్ని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడుతూ కెప్టెన్ రోహిత్ కేఎల్ రాహులే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని తెలిపాడు
- By Sudheer Published Date - 06:03 PM, Thu - 5 December 24

కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. భారత్-ఆస్ట్రేలియా (IndiaVSAustralia)మధ్య జరగనున్న అడిలైడ్ టెస్టు మ్యాచ్(Adelaide Test Match)కు ముందు రోహిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమావేశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే ఓపెనింగ్ జోడీపై రోహిత్ చెప్పే అంశంపై గత వారం రోజులుగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరన్న దానిపై తాజాగా రోహిత్ సమాధానమిచ్చాడు. అన్ని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడుతూ కెప్టెన్ రోహిత్ కేఎల్ రాహులే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని తెలిపాడు. తొలి టెస్టులో కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని రోహిత్ చెప్పాడు. నా కొడుకుని ఎత్తుకుని రాహుల్ బ్యాటింగ్ ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఓపెనింగ్ జోడీలో మార్పు అవసరం లేదనిపించింది సో ఆ జోడీని అలాగే కొనసాగించాలని భావించానని అన్నాడు. కేఎల్ రాహుల్ విదేశీ పిచ్ లపై ఓపెనర్ గా బాగా రాణించగలడని రోహిత్ బలంగా నమ్ముతున్నాడు. అయితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో పక్కనపెడితే ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా దిగుతాడంటూ రోహిత్ ప్రకటించాడు.
పెర్త్ టెస్టులో కెఎల్ రాహుల్ ,యశస్వి జైస్వాల్ మధ్య చారిత్రక భాగస్వామ్యం ఏర్పడింది. దీనిని రోహిత్ శర్మ ప్రశంసించాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ కూడా అద్భుత బ్యాటింగ్ తో 161 పరుగులు సాధించాడు. అయితే మొదటి వికెట్‌కు యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో కెఎల్ ,యశస్వి ఓపెనింగ్ జోడి మరోసారి బరిలోకి దిగనుంది. రాహుల్ ఓపెనింగ్ కాగా రోహిత్ శర్మ మిడిల్ అర్దర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. 2019 సంవత్సరానికి ముందు రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు.
Read Also : ISRO PSLV C-59: నిప్పులు చిమురుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-59