HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Irfan Pathan Snubbed From Ipl 2025 Commentary Panel This Is The Reason

Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్.. ఇర్ఫాన్‌ కీలక ప్రకటన

ఇక ఐపీఎల్(Irfan Pathan) కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తనను తొలగించిన వెంటనే ఇర్ఫాన్‌ పఠాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • By Pasha Published Date - 07:56 PM, Sat - 22 March 25
  • daily-hunt
Irfan Pathan Ipl 2025 Ipl Commentary Panel Sanjay Manjrekar Harsha Bhogale

Irfan Pathan : ఐపీఎల్‌ 2025  సీజన్ ప్రారంభం అవుతున్న వేళ షాకింగ్ న్యూస్. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌‌ను   బీసీసీఐ పక్కన పెట్టినట్లు సమాచారం. ఈమేరకు ఐపీఎల్‌ కమిటీ ఆయనపై వేటు వేసినట్లు తెలిసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండగా కామెంట్రీ చేసే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ కావాలనే కొందరు ఆటగాళ్లపై వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీసీసీఐకి ఫిర్యాదులు అందాయి. ఆస్ట్రేలియాలో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ జరిగిన సమయంలో కొందరు ఆటగాళ్లపై ఇర్ఫాన్ పఠాన్‌ కామెంట్స్ చేశారు. అవి నచ్చకపోవడంతో ఓ ఆటగాడు పఠాన్‌ నంబరును తన ఫోన్‌లో బ్లాక్‌ చేశాడట. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌‌పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు నుంచి జరగనున్న ఐపీఎల్‌ 18వ సీజన్‌  మ్యాచ్‌ల కోసం అధికారిక కామెంట్రీ ప్యానెల్‌ జాబితాను బీసీసీఐ శుక్రవారమే విడుదల చేసింది. ఇందులో ఇర్ఫాన్‌ పఠాన్‌ పేరు లేదు.

Mic on, filter off. #SeedhiBaat with #IrfanPathan – jahan baatein hoti hain asli.
Link yahi hai boss: https://t.co/NQixk8f3aN pic.twitter.com/xiOg3Ymyuv

— Irfan Pathan (@IrfanPathan) March 22, 2025

Also Read :Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్‌.. ఆయన నేపథ్యమిదీ  

ఇర్ఫాన్‌ పఠాన్ సొంత యూట్యూబ్‌ ఛానల్‌

ఇక ఐపీఎల్(Irfan Pathan) కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తనను తొలగించిన వెంటనే ఇర్ఫాన్‌ పఠాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ‘‘మైక్‌ ఆన్‌.. ఫిల్టర్‌ ఆఫ్‌. ఇర్ఫాన్‌తో నేరుగా మాట్లాడుదాం. వాస్తవాలే మాట్లాడుకుందాం’’ అని పేర్కొంటూ ఇర్ఫాన్ పోస్ట్‌ పెట్టడం గమనార్హం.

Also Read :PVR Inox : బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్

సంజయ్‌ మంజ్రేకర్‌, హర్ష భోగ్లే‌పైనా ఇలాగే.. 

గతంలో సంజయ్‌ మంజ్రేకర్‌, హర్ష భోగ్లే వంటి వారిపైనా బీసీసీఐ ఇదే తరహాలో చర్యలు తీసుకుంది. 2019లో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై మంజ్రేకర్‌ వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తోటి క్రికెట్ కామెంటేటర్‌ భోగ్లేతోనూ ఆయన వివాదానికి దిగారు. ఈ పరిణామల తర్వాత 2020లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కామెంట్రీ ప్యానెల్‌ నుంచి మంజ్రేకర్‌ను బీసీసీఐ తప్పించింది. 2016 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు భోగ్లేపైనా ఇలాంటి పరిస్థితుల్లోనే వేటు పడింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Harsha Bhogale
  • IPL 2025
  • IPL Commentary Panel
  • Irfan Pathan
  • Sanjay Manjrekar

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd