HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Ipl 2023 Brian Lara Appointed New Sunrisers Hyderabad Coach

IPL 2023: సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా విండీస్ దిగ్గజం

ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా బాధ్యతలు చేపట్టనున్నాడు.

  • By Balu J Published Date - 03:40 PM, Sat - 3 September 22
IPL 2023: సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా విండీస్ దిగ్గజం

ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సీజన్‌లో కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీపై హైదరాబాద్ ఫ్రాంచైజీ వేటు వేసి.. అతని స్థానంలో లారాను ఎంపిక చేసింది. 15వ సీజన్‌లో లారా సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గానూ, స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా వ్యవహరించాడు. యుఏఈ వేదికగా జరిగిన సీజన్ సమయంలో సన్‌రైజర్స్ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేసిన మూడీ వేలం సమయంలో అందుబాటులో లేడు. అయితే సీజన్ ప్రారంభానికి మూడీనే కోచ్‌గా నియమించింది. అయితే మూడీ ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ ప్రదర్శన ఆశించిన విధంగా లేదు. దీంతో అతని కాంట్రాక్టును పొడిగించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం నిరాకరించింది. నిజానికి గతంలోనూ మూడీ హైదరాబాద్ కోచ్‌గా మంచి ఫలితాలనే అందించాడు.

2016లో హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు కోచ్ మూడీనే. 2019లో టామ్ మూడీ కోచ్‌గా తప్పుకోవడంతో ట్రెవర్ బేలైసిస్‌ బాధ్యతలు తీసుకున్నాడు. అతని కోచింగ్‌లోనూ హైదరాబాద్ నిరాశపరిచింది. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, తుది జట్టులో చోటు కల్పించకపోవడం వంటి పరిణామాలతో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. వేలంలోనూ సన్‌రైజర్స్ సరైన ఆటగాళ్ళను తీసుకోలేదన్న విమర్శలూ వచ్చాయి. దానికి తగ్గట్టే హైదరాబాద్ 15వ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ 6 విజయాలు, 8 ఓటములతో 8వ స్థానంలో నిలిచింది. దీంతో కోచింగ్‌ స్టాఫ్ మార్పుపైనే సన్‌రైజర్స్ యాజమాన్యం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే మూడీని తప్పించి ఇప్పుడు లారాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించింది

Tags  

  • brian lara
  • coach
  • IPL
  • sun risers

Related News

Viacom18: వయాకామ్‌ 18కే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్!

Viacom18: వయాకామ్‌ 18కే మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్!

టాప్ దిగ్గజాలు పోటీ పడిన వేళ వయాకామ్‌ (18 Viacom18) ప్రసార హక్కులు దక్కించుకుంది.

  • IPL: ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీగా చూడండిలా..రిలయన్స్ బంపరాఫర్

    IPL: ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీగా చూడండిలా..రిలయన్స్ బంపరాఫర్

  • Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?

    Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?

  • IPL : పంత్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు. ఐపీఎల్ ఢిల్లీ కెప్టెన్ గా అతని స్థానంలోకి

    IPL : పంత్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు. ఐపీఎల్ ఢిల్లీ కెప్టెన్ గా అతని స్థానంలోకి

  • Mayanka Agarwal: సన్ రైజర్స్ కెప్టెన్ గా అతనేనా

    Mayanka Agarwal: సన్ రైజర్స్ కెప్టెన్ గా అతనేనా

Latest News

  • Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం

  • Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!

  • IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

  • Gold And Silver Price Today: బంగారం ధరలు ఇలా.. వెండి ధరలు అలా..!

  • Shooting At Nightclub: మెక్సికోలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: