IPL 2022 : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యేది వీరే
ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీకి ఇంతటి క్రేజ్ దక్కడానికి విదేశీ ఆటగాళ్లు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.
- By Naresh Kumar Published Date - 12:22 PM, Tue - 15 March 22

ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీకి ఇంతటి క్రేజ్ దక్కడానికి విదేశీ ఆటగాళ్లు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. విదేశీ క్రికెటర్లు తమ్ అత్యుత్తమ ప్రదర్శనతో ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చారు. అయితే ప్రతి సీజన్లో విదేశీ ప్లేయర్లు అన్ని మ్యాచ్‌ల్లో ఆడటం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే.. వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటారు. అయితే తాజాగా ఇదే కారణంతో ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచులకు కూడా కొందరు ఆటగాళ్లు దూరమవుతున్నారు. మరి ఆ జాబితాలో ఉన్న ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం…
ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ దూరం కానుండగా.. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ జట్టు నుంచి ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మార్క్ స్టాయినిస్ , సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ దూరం కానున్నారు.. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో , దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కాగిసో రబడా దూరం కానుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లేన్ మ్యాక్స్ వెల్, జోష్ హేజిల్ వూడ్ దూరం కానున్నారు.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్ సౌతాఫ్రికా పేసర్లు లుంగీ ఎంగిడి , అన్రిచ్ నోర్ట్జే దూరం కానుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్ దూరం కానున్నారు..
అలాగే ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచులకు రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ దూరం కానుండగా.. కేకేఆర్ జట్టు నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ , ప్యాట్ కమిన్స్ దూరం కానున్నారు.. ఇక ముంబై ఇండియన్స్ జట్టు నుంచి ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి సౌతాఫ్రికా ఆటగాడు డ్వైన్ ప్రిటోరియస్ దూరం కానున్నాడు.