CSK Record : చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డ్
ఐపీఎల్ 15వ సీజన్ ఇంకా ఆరంభమే కాలేదు... అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఏంటీ అనుకుంటున్నారా...
- By Hashtag U Published Date - 03:08 PM, Sat - 29 January 22

ఐపీఎల్ 15వ సీజన్ ఇంకా ఆరంభమే కాలేదు… అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఏంటీ అనుకుంటున్నారా… సీఎస్కే రికార్డ్ నిజమే కానీ అది మైదానంలో కాదండి… గ్రౌండ్ బయట. దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికార్న్ కంపెనీగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ గల ప్రైవేట్ సంస్థలను యూనికార్న్ కంపెనీలుగా పిలుస్తారు. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 7,600 కోట్ల రూపాయలు దాటింది. అలాగే యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ మార్కెట్ వ్యాల్యూను కూడా చెన్నై అధిగమించింది. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్ మార్కెట్ వ్యాల్యు 6869 కోట్లుగా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్కెట్ వాల్యూ 7600 కోట్లుగా ఉంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండీ అంటే గత 14 ఏళ్ళుగా బ్రాండింగ్ లోనూ, ఆటలోనూ చెన్నై జట్టు తిరుగులేని ఫాలోయింగ్ దక్కించుకుంది. లీగ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందింది. భారత్ రెండు ప్రపంచకప్ లు అందించిన మహేంద్రసింగ్ ధోనీ చెన్నై జట్టును లీడ్ చేస్తుండగా.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది. కాగా గత ఏడాది కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న చెన్నై ఫైనల్లో కోల్ కతాపై గెలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలానికి సీఎస్కే సన్నధ్ధమవుతోంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న కెప్టెన్ ధోనీ, జట్టు యాజమాన్యం , కోచింగ్ స్టాఫ్ తో కలిసి వేలానికి వ్యూహరచన చేస్తున్నాడు. రిటెన్షన్‌లో భాగంగా చెన్నై16 కోట్ల రూపాయాలు వెచ్చించి రవీంద్ర జడేజను మొదటి ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. అలాగే ధోనికి 12 కోట్లు, మొయిన్ అలీకి 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కు 6 కోట్ల రూపాయలు వెచ్చించింది