IPL Auction : మెగా వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్నది వీరే
ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ళ జాబితా విడుదలైపోవడంతో ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై దృష్టి పెట్టాయి.
- By Hashtag U Published Date - 11:39 AM, Sat - 22 January 22
ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ళ జాబితా విడుదలైపోవడంతో ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై దృష్టి పెట్టాయి. వేలంలో ఎవరిని సొంతం చేసుకోవాలి… యువ ఆటగాళ్లలో ఎవరిని దక్కించుకోవాలన్న దానిపై వ్యూహరచన చేస్తున్నాయి. ఈ సారి కూడా మెగా వేలంలో ఆటగాళ్ళపై కాసుల వర్షం కురవనుంది. గతంతో పోలిస్తే ఈ సారి యువ ఆటగాళ్లలో పలువురు జాక్ పాట్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పలువురు స్టార్ ప్లేయర్స్ తమ బేస్ ప్రైస్ ను కూడా నిర్ణయించుకున్న జాబితా విడుదలైంది. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో ఆస్ట్రేలియా పేసర్ స్టార్ కమ్మిన్స్ , ఓపెనర్ డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ , సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ , డుప్లెసిస్ , కగిసో రబడ, లుంగి ఎంగిడి, మార్కో జాన్సన్, ఇంగ్లాండ్ కు చెందిన మార్క్ వుడ్ ఉన్నారు. వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వయాన్ బ్రేవో 2 కోట్ల బేస్ ప్రైస్ లోనే ఉండగా.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మాత్రం వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ వేలానికి దూరమవడం ఆశ్చర్య పరిచింది.
కాగా 2 కోట్ల బేస్ ప్రైస్ లో భారత క్రికెటర్లు అశ్విన్, సురేష్ రైనా, ఊతప్ప, షమీ, చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ , భువనేశ్వర్, హర్షల్ పటేల్, అంబటి రాయుడు, శార్థూల్ ఠాకూర్ , కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ , దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ , దినేశ్ కార్తీక్ ఉన్నారు. ఇక 1.5 కోట్ల బేస్ ప్రైస్ జాబితాలో అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఉండగా… విదేశీ ఆటగాళ్ళలో క్రిస్ లిన్, ఫించ్ , నాథన్ లయోన్ , జిమ్మీ నిషమ్ , మోర్గాన్, డేవిడ్ మలాన్ , మున్రో, టిమ్ సౌథీ , హెట్ మెయిర్, జాసన్ హోల్డర్ , నికోలస్ పూరన్, హేల్స్, జానీ బెయిర్ స్టో , కేన్ రిచర్డసన్ ఉన్నారు. ఇదిలా ఉంటే కోటి రూపాయల బేస్ ప్రైస్ జాబితాలో పియూష్ చావ్లా , కేదార్ జాదవ్, ప్రసిద్ధ కృష్ణ, నటరాజన్, మనీశ్ పాండే, రహానే, నితీష్ రాణా, సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్ ఉండగా.. విదేశీ ఆటగాళ్ళలో మహ్మద్ నబీ, ఫాల్కనీర్, హెన్సిక్స్ , లబూషేన్, ఆండ్రూ టై , వాండర్ డస్సెన్ తో పాటు మరికొందరు ఉన్నారు.
ఇక దేశవాళీ క్రికెట్ తో పాటు అండర్ 19 నుండి పలువురు ఆటగాళ్ళ కనిష్ట ధర 20 లక్షలుగా బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం అండర్ 19 ప్రపంచకప్ లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్ళ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశముంది. కాగా ఈ సారి ఐపీఎల్ వేలానికి దూరమైన స్టార్ ఆటగాళ్ళలో జో రూట్ , క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ , మిఛెల్ స్టార్క్ , క్రిస్ వోక్స్ ఉన్నారు. వీరిలో ఆర్చర్ గాయంతో తప్పుకోగా.. స్టోక్స్ , రూట్ మాత్రం యాషెస్ సిరీస్ వైఫల్యంతో వైదొలిగారు. అటు గేల్ రిటైర్మెంట్ కు చేరవ కావడంతో వేలంలో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే అవకాశం కూడా కనిపించలేదన్న వార్తల నేపథ్యంలోనే తప్పుకున్నట్టు భావిస్తున్నారు.
Tags
Related News
ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.