IPL Auction 2022 : వార్నర్ ఫైనల్ బిడ్ ఎంతో తెలుసా ?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కోసం ఈ సారి వేలంలో హోరాహోరీ పోటీ తప్పేలా లేదు.
- By Naresh Kumar Published Date - 02:42 PM, Tue - 8 February 22
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కోసం ఈ సారి వేలంలో హోరాహోరీ పోటీ తప్పేలా లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ వార్నర్ ను వదిలేయడంతో ఆ ఆసీస్ స్టార్ ప్లేయర్ ను తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ వార్నర్ కోసం పోటీ పడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో వార్నర్ కు అద్భుతమైన రికార్డుంది. గత సీజన్ కు ముందు మాత్రం సరైన ఫామ్ లో లేకపోవడంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుండి తప్పించడంతో పాటు తుది జట్టులోను చోటివ్వలేదు. ఫ్రాంచైజీ యాజమాన్యం వైఖరితో వార్నర్ మనస్థాపానికి గురయ్యాడు. ఊహించినట్టుగానే వార్నర్ ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. అదే సమయంలో ప్రపంచకప్ లో వార్నర్ అదరగొట్టాడు. తర్వాత పలు మ్యాచ్ లలోనూ తన ఫామ్ కొనసాగించడంతో వేలానికి ముందే డిమాండ్ పెరిగింది.
ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు అత్యధిక పరుగుల అవార్డు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న వార్నర్ 2016లో సారిథిగా సన్ రైజర్స్ కు ట్రోఫీని కూడా అందించాడు. ఓపెనర్ గా పరుగుల వరద పారించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాగే కెప్టెన్ గానూ వార్నర్ కు మంచి రికార్డే ఉంది. 69 మ్యాచ్ లలో సారథిగా ఉన్న వార్నర్ 35 విజయాలు సాధించాడు. వార్నర్ కంటే ముందు సక్సెస్ ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో ధోనీ, రోహిత్ శర్మ, గంభీర్ ఉన్నారు. సహజంగానే ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వార్నర్ ఉన్న ఫామ్ , గత రికార్డుల ప్రకారం చూస్తే వేలంలో ఎంత ధర పలుకుతాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలం బరిలో నిలిచాడు. బెంగళూరు, చెన్నై, కోల్ కతా, పంజాబ్ జట్లు వార్నర్ దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నించబోతున్నాయి. విశ్లేషకులు, ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం ఆ ఆసీస్ స్టార్ ప్లేయర్ 12 నుండి 13 కోట్ల రూపాయలకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే వార్నర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా 590 మంది క్రికెటర్లతో బీసీసీఐ తుది జాబితాను ఖరారు చేసింది.
Tags
Related News
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని