HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Injured Ravindra Jadeja Ruled Out Of Ipl 2022

IPL 2022 : ఐపీఎల్ నుంచి చెన్నై స్టార్ ప్లేయర్ ఔట్

ఐపీఎల్ 15 వ సీజన్ లో వరుస గాయాలు చెన్నై సూపర్ కింగ్స్ ను వెంటాడుతూనే ఉన్నాయి.

  • Author : Hashtag U Date : 12-05-2022 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravindra Jadeja (1)
Ravindra Jadeja (1)

ఐపీఎల్ 15 వ సీజన్ లో వరుస గాయాలు చెన్నై సూపర్ కింగ్స్ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు గాయాలతో దూరమవగా తాజాగా మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ టీమ్‌ ఆల్‌రౌండర్‌, మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా మిగతా మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు సీఎస్కే టీమ్‌ వెల్లడించింది. ఇదే గాయం కారణంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడని, అయితే మెడికల్‌ సిబ్బంది సూచన మేరకు ఈ సీజన్‌లో తర్వాతి మ్యాచ్‌లు కూడా జడేజా ఆడటం లేదని మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఈ గాయం చేసుకున్నాడు. రెండు రోజుల తర్వాత కూడా జడేజా గాయంలో ఎలాంటి మార్పూ రాలేదు. అటు ఆ టీమ్‌ ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న ఆ టీమ్‌.. అన్నింట్లోనూ గెలవడంతోపాటు అటు ఆర్సీబీ, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోవాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా అయితేనే చెన్నై ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో అతడు ఆడకపోవడంతో.. శివమ్‌ దూబె అతని స్థానాన్ని భర్తీ చేశాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో ఆ తర్వాత గుజరాత్‌ టైటన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై కు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో జడేజా ఫామ్‌ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. 10 మ్యాచ్‌లలో కేవలం 116 రన్స్‌ చేసిన జడ్డూ.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సీజన్ కి జడేజా కొన్ని మ్యాచ్‌లకు చెన్నైకి కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే ఆ టీమ్‌ వరుస ఓటములతో కెప్టెన్సీ వదిలేసి మళ్లీ ధోనీకి అప్పగించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • IPL 2022
  • ravindra jadeja

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd