Lightning Strike : ఫుట్‌బాలర్‌పై పిడుగు.. గ్రౌండ్‌లోనే చనిపోయిన ప్లేయర్
Lightning Strike : ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది.
- Author : Pasha
Date : 12-02-2024 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
Lightning Strike : ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుతూ తమ టీమ్‌ను గెలిపించేందుకు యత్నిస్తున్న ఫుట్ బాల్ ప్లేయర్ క్షణాలలో నిర్జీవంగా మారారు. దీంతో ఈ మ్యాచ్‌ను చూస్తున్న వారంతా షాక్‌కు గురయ్యారు. పిడుగు పడి ప్లేయర్ చనిపోయాడని తెలుసుకొని అందరూ నివ్వెరపోయారు. ఈ ఘటన ఆదివారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఇండోనేషియా దేశపు వెస్ట్ జావాలో ఉన్న బాండుంగ్ పట్టణంలోని సిలివాంగి స్టేడియంలో ఎఫ్‌సీ బాండుంగ్, ఎఫ్‌బీఐ సుబాంగ్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
పిడుగు వచ్చి మీద పడటంతో(Lightning Strike) ప్లేయర్ నిలుచున్న చోటే కుప్పకూలాడు.నిలువునా కుప్పకూలిన తోటి ప్లేయర్ దగ్గరికి మిగతా ప్లేయర్లు పరుగెత్తుకెళ్లారు. సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు. చనిపోయిన ప్లేయర్ వయసు 34 ఏళ్లు అని తెలుస్తోంది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమీపం నుంచే ఇదంతా చూసిన తోటి ప్లేయర్లు షాక్‌కు గురయ్యారు. అందరూ కన్నీటిపర్యంతం అయ్యారు. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలలోనూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ అవన్నీ క్రీడాకారులు చేసే తప్పిదాల వల్ల జరుగుతాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే ఘటన మాత్రం అందుకు పూర్తి విభిన్నం. మానవ ప్రమేయం లేకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఓ ఫుట్‌బాలర్ మృతిచెందడం విషాదకరం.
Also Read : Ashok Chavan: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్‌నాథ్ కూడా.. ?
In Indonesia, a football player was killed by lightning during a match .
A 30-year-old Persicas Subang player was reported dead. pic.twitter.com/WkPEEr7lZL
— Bad AI (@Bad_AI_) February 11, 2024