Esha Singh : ఎంఎల్ఆర్ఐటీలో భారత మహిళా షూటర్ ఈషా సింగ్‌కు ఘన సత్కారం
ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్ ఈషా సింగ్‌ను ఎంఎల్ఆర్ఐటీ
- Author : Prasad
Date : 10-11-2023 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్ ఈషా సింగ్‌ను ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను ఈషా సందర్శించి, అక్కడి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షూటింగ్, ఫెన్సింగ్ క్రీడాకారులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా వర్ధమాన క్రీడాకారులు ఇషాను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ప్రధాన టోర్నమెంట్లలో ఒత్తిడిని ఎలా తట్టుకుంటావు? ఏ విధంగా సాధన చేస్తావు? వంటి పలు ప్రశ్నలకు ఈషా వారికి సమాధానాలు ఇచ్చింది. అనంతరం ఇషాను లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డీన్ రాధిక కలిసి సన్మానించారు.
Also Read: Pragya Jaiswal : లోదుస్తులు మర్చిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్