Rajeshwari Gayakwad: సూపర్ మార్కెట్ లో టీమిండియా మహిళా క్రికెటర్ గొడవ
టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకుంది.
- By Gopichand Published Date - 11:36 AM, Fri - 2 December 22

టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఇటీవల తన స్నేహితులతో ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ఆమె.. అక్కడ సిబ్బందితో గొడవ పెట్టుకుంది. గొడవ కాస్త పెద్దదిగా మారి సిబ్బందిపై దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. దాడి ఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది.
మహిళా క్రికెటర్ సౌందర్య సాధనాలు కొనడానికి సూపర్ మార్కెట్ కువెళ్ళింది. తొలుత రాజేశ్వరి మార్కెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, కొంతసేపటికి ఆమె సన్నిహితులు కొందరు సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో మొత్తం దృశ్యాలు రికార్డు అయ్యాయి. సూపర్‌మార్కెట్ సిబ్బంది CCTV ఫుటేజీ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత రెండు వైపులా పోలీసు ఫిర్యాదు చేయకుండానే పరిష్కరించుకున్నారు. విజయ్‌పూర్‌కు చెందిన ఆనంద్ కుమార్ ఎటువంటి FIR నమోదు చేయలేదని చెప్పారు. కేసు నమోదు అయితే క్రికెటర్ రాజేశ్వరి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
రాజేశ్వరి 2014లో ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా అరంగేట్రం చేసింది. ఆమె 2014న శ్రీలంకతో జరిగిన ODIలో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో రాజేశ్వరి కూడా సభ్యురాలు. ఆ టోర్నీలో రాజేశ్వరి న్యూజిలాండ్‌పై 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.