World Cup 2023: టీమిండియాను వెంటాడుతున్న సమస్య
సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ప్రపంచ కప్ మహాసంగ్రామం మొదలు కాబోతుంది. పది జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఫెవరెట్ జట్లలో భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
- Author : Praveen Aluthuru
Date : 01-10-2023 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ప్రపంచ కప్ మహాసంగ్రామం మొదలు కాబోతుంది. పది జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఫెవరెట్ జట్లలో భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జాట్లున్నాయి. ఇక సొంత మైదానం సపోర్టుతో టీమిండియా ప్రపంచ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆటగాళ్ల సత్తా ఏంటో ఇటీవల జరిగిన సిరీస్ లను పరిశీలిస్తే అర్ధం అవుతుంది. టీమ్ ఇండియా తన బ్యాటింగ్ బలాన్ని పెంచుకుంది. బౌలింగ్ విభాగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. హాఫ్ అమౌంట్ ఆఫ్ సీనియర్లతో నిండిఉన్న టీమిండియా యువరక్తాన్ని కూడా భాగం చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభాన్నిస్తే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలరు. బౌలింగ్ విభాగంలో అవసరంమేరా పటిష్టమైన ప్లేయర్లున్నారు. కానీ టీమిండియాను ఓ సమస్య విపరీతంగా వేధిస్తుంది. క్యాచ్‌లు జారవిడుచుకోవడంలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. 2019 ప్రపంచ కప్ నుంచి టీమ్ ఇండియా మొత్తం 89 క్యాచ్‌లను వదిలివేసింది. వెస్టిండీస్ 79 క్యాచ్‌లను వదిలేసింది. బంగ్లాదేశ్ 65, దక్షిణాఫ్రికా 54 క్యాచ్‌లు వదిలేశాయి. క్యాచ్ పట్టు మ్యాచ్ గెలువు అన్న సామెతను మనోళ్లు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరముంది. ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా క్యాచ్‌లను వదిలేస్తూ పోతే విజయం సాధించడం చాలా కష్టమంటున్నారు విశ్లేషకులు.
Also Read: Madhya Pradesh: ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం