HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Announces Womens Cricket Squad For Commonwealth Games

Birmingham 2022:కామన్ వెల్త్ గేమ్స్ కు భారత మహిళల క్రికెట్ టీమ్ ఇదే

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ గా స్మృతి మందానా ఎంపికయ్యారు.

  • Author : Naresh Kumar Date : 12-07-2022 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harmanpreet Kaur
Harmanpreet Kaur

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ గా స్మృతి మందానా ఎంపికయ్యారు. ఇటీవలే శ్రీలంక టూర్ లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఈ మెగా ఈవెంట్ లోనూ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. శ్రీలంకతో సిరీస్‌ నుంచే కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహాలు ప్రారంభించామనీ కోచ్ రమేష్ పోవార్ చెప్పాడు. వికెట్స్ నెమ్మదిగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు,ఎక్కువ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశముందన్నాడు. అయితే హర్మన్ ప్రీత్, షెఫాలీ వర్మ, జెమియా రోడ్రిగ్స్, స్మృతి మంధానా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారనీ, వాళ్లే కీలకం కానున్నారని రమేశ్ పొవార్ అన్నారు.టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గ్రూప్-బీలో ఉన్నాయి. ఈ నెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా… రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి. తొలి సారిగా మహిళల జట్టు ఈ పోటీల్లో పాల్గొంటున్న తరుణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1998లో జరిగిన కౌలాలంపూర్ గేమ్స్‌లో పురుషుల జట్టు తొలిసారి ప్రాతినిధ్యం వహించింది.

Squad: Harmanpreet Kaur (c), Smriti Mandhana (vc), Shafali Verma, Sabbhineni Meghana, Taniyaa Bhatia (wk), Yastika Bhatia (wk), Deepti Sharma, Rajeshari Gayakwad, Pooja Vastrakar, Meghna Singh, Renuka Thakur, Jemimah Rodrigues, Radha Yadav, Harleen Deol, Sneh Rana

Standby players: Richa Ghosh, Simran Bahadur, Poonam Yadav


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Birmingham 2022
  • Harmanpreet Kaur
  • team india

Related News

BCCI Releases Team India 2026-27 Schedule

BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్‌ విడుదల

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd