ICC Men’s T20 World Cup 2022:హాట్ కేకుల్లా టీ ట్వంటీ వరల్డ్ కప్ టిక్కెట్లు
టెస్ట్ , వన్డే ఫార్మేట్లతో పోలిస్తే టీ ట్వంటీలకు క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ తో సహా పలు టీ ట్వంటీ లీగ్స్ బాగా హిట్ అయ్యాయి.
- By Naresh Kumar Published Date - 02:35 PM, Thu - 15 September 22
టెస్ట్ , వన్డే ఫార్మేట్లతో పోలిస్తే టీ ట్వంటీలకు క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ తో సహా పలు టీ ట్వంటీ లీగ్స్ బాగా హిట్ అయ్యాయి. ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తే అభిమానులకు ఉండే ఆసక్తి , ఉత్కంఠ ప్రత్యేకంగా చెప్పాలా.. ఇప్పుడు అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు జట్లు బలబలాల పరంగా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న వేళ హోరాహోరీగా జరిగే మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎగబడుతున్నారు.
అందుకే టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టు ఐసీసీ ప్రకటించింది. ఏకంగా 82 దేశాలకు చెందిన అభిమానులు ఈ టికెట్లను కొనుగోలు చేసినట్టు తెలిపింది.5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైపోగా.. అందులో పిల్లల టికెట్లే 85 వేలుగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లు చూడటానికి పిల్లలకైతే కనీస టికెట్ ధర 5 డాలర్లుగా, పెద్దలకైతే 20 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకొని, చివరి నిమిషంలో వద్దనుకుంటే స్టేడియం దగ్గరే టికెట్లు రీసేల్ చేసుకునేందుకు వీలుగా అధికారికంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. అటు ట్రైన్ టిక్కెట్ల తరహాలో టికెట్లు అయిపోతే వెయిటింగ్ లిస్ట్‌లోనూ యాడ్ చేస్తున్నారు. ఒకవేళ అదనపు టికెట్లు అందుబాటులోకి వస్తే ఈ వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు ఇవ్వనున్నట్టు ఐసీసీ తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీకే మోస్ట్ హైవోల్టేజ్ క్లాష్ గా ఉన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లన్నీ ఎప్పుడో అమ్ముడైపోయాయి. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష కాగా.. ఆ టికెట్లన్నీ ఐదు నిమిషాల్లోనే అమ్ముడవడంతో మరో నాలుగు వేల టికెట్లను కేవలం నిల్చొని చూసే వీలు కల్పిస్తూ ఐసీసీ రిలీజ్ చేసింది. కాగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 8 టీమ్స్ నేరుగా క్వాలిఫై అవగా.. మరో నాలుగు టీమ్స్ ఈ రౌండ్ మ్యాచ్‌లలో ఆడి అర్హత సాధించనున్నాయి. ఇక సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 23న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌తో ప్రారంభమవుతాయి.
Tags
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.